Home » The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

by Bunty
Ad

ది కేరళ స్టోరీ సినిమా… ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. హీరోయిన్ అదా శర్మ కీ రోల్ చేసిన సినిమానే ది కేరళ స్టోరీ. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వివాదంలోనే కొనసాగుతుంది. దీనిపై ముస్లింలు అలాగే సెక్యులర్ పార్టీలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నాయి. ముస్లింలను అగౌరపరిచేలా ఈ సినిమా ఉందని వారి వాదన. అందుకే చాలామంది ముస్లింలు మరియు సెక్యులర్ వాదులు ఈ సినిమాను దేశంలోని పలు చోట్ల అడ్డుకుంటున్నారు.

Advertisement

 

అయితే తాజాగా ఈ సినిమా చూసిన ఓ ప్రేమజంట… సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా చూసి తన ప్రియుడిపై ఓ మహిళ కేసు పెట్టింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి.. అదే నగరానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇటీవల వారు కేరళ స్టోరీ సినిమా చూశారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం.. తన ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడి… మతం మారాలని ఆమె ప్రియుడు హెచ్చరించాడు.

Advertisement

అయినా ఆమె మాట వినకపోవడంతో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. ఇక ఆ బాధను భరించలేక నేరుగా పోలీసులకు ప్రియుడిపై ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుని అరెస్టు చేసి… బొక్కలో వేశారు. కాగా అరెస్టు అయిన యువకుడు 12వ తరగతి చదువుతూ ఖాళీగా ఉన్నాడు. అటు ఆ యువతీ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

అతడు సినిమాలో అసలు నందు ఎవరు?

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

Visitors Are Also Reading