Home » ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజా నటించిన ఆది పురుష్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. సినిమా అంతా బాగానే ఉంది.. కానీ  ఏదో మిస్సయింది అంటూ ప్రేక్షకులు పేర్కొంటున్నారు.  సినిమా ఎలా ఉన్నప్పటికీ టాక్ తో  ఏమాత్రం సంబంధం లేకుండా ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం భారీగానే వసూలు అవుతున్నాయి. ఇంతకుముందు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాస్తు దూసుకుపోతూ ఉంది. ఆదిపురుష్ మూవీ ఇలా విడుదల అయిందో లేదో అందరి దృష్టి ప్రభాస్ తన తర్వాత సినిమా సలార్ పై పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

Advertisement

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుత శర వేగంగా జరుపుకుంటుంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మూవీని తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో  చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

మరో రెండు మూడు వారాల్లోనే సలార్ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. జూన్  చివరికి లేదా జూలై మొదటి వారంలో సలార్  టీజర్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఆది పురుషుతో కాస్త డీల పాడిన ప్రభాస్ అభిమానులకు సలారు టీజర్ మంచి బూస్ట్ ఇవ్వడం పక్కా అని భావిస్తున్నారు. ఇక సలార్ మూవీ ఎలా ఉంటాదో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 28 వరకు ఎదురు చూడాల్సిందే.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ భార్య గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!

సుధాకర్ కొడుక్కి అండగా చిరంజీవి.. స్నేహితుడి కోసమే..!

Visitors Are Also Reading