Home » పవన్ కళ్యాణ్ భార్య గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

పవన్ కళ్యాణ్ భార్య గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

by Anji
Ad

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా రష్యా దేశస్థురాలు అనే విషయం దాదాపు మనందరికీ తెలిసిన విషయమే. పవన్ అన్న దంపతులకు కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పోలేనా అంజనా ఉన్నారు ఒక ఫారం దేశంలో పుట్టి పెరిగిన అన్న లెజినోవా  ఎలాంటివారో మెగా కుటుంబంతో ఎలా నడుచుకుంటున్నారో క్లుప్తంగా తెలుసుకుందాం.

Advertisement

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ కాదు. కేవలం ఆమె తన బంధుమిత్రులతోనే మాట్లాడుతారు. హై స్కూల్ గ్రాడ్యుయేషన్ మాత్రమే పూర్తి చేసిన అన్నా లెజినోవా.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.  తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ ని తొలిసారిగా కలిశారు. ఆ సమయంలోనే పవన్ కి లెజినోవాకి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరు కొంతకాలం పాటు డేటింగ్ కూడా చేశారు.

పవన్ తన రెండో భార్య రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి.. 2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ  రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నా లెజినోవాని  పెళ్లి చేసుకున్నారు. ఆ క్షణం నుంచి అన్నా లెజినోవా  రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఆమె కూడా కాటన్ వస్త్రాలను ధరిస్తూ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పెళ్లయిన కొత్తలో అన్నా లెజినోవా తన భర్త పవన్ తో కలిసి డిన్నర్ కు వెళ్లేవారు. కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ గా ఏ ఈవెంట్ కి వెళ్ళిన సందర్భాలు లేవు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లికి అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రాదరణలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

చీర కట్టు నుదుట బొట్టు సిజ పెళ్లిలో అన్న చాలా చుకుగా పాల్గొని మెగా కుటుంబంలో ఎలా కలిసిపోతున్నారో చెప్పారు. భారతీయ సంప్రదాయాల పట్ల పెద్దగా అవగాహన లేనప్పటికీ అప్పట్లో అన్నా లేజనోవా పవన్ కి హారతి పడుతూ.. ఈర తిలకం దిద్దుతూ పవన్ గారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతూ అనిపించారు. భారతీయ సాంప్రదాయం ఉట్టిపాడేలా ఆమె నిండు వస్త్రాలతో పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించారు. పవన్ పెద్ద సెలబ్రిటీ అయినా ఆమె ఎటువంటి ప్రగల్బాలకు పోరు. తన ఫోటోలను సోషల్ మీడియా వేదిక ద్వారా అప్లోడ్ చేసిన సందర్భాలు కూడా లేవు. బట్టి చూస్తుంటే ఆమె ప్రపంచంతో ఉన్న సంబంధం లేకుండా కేవలం పవన్ కి మాత్రమే సేవ చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తున్నారని తెలుస్తోంది. నాగబాబు కూడా రేణు దేశాయ్ కంటే అన్నా లెజైనవానే తమ కుటుంబంలో బాగా కలిసిపోతున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లెజెండ్ అంటే మెగా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమేనట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రాజమౌళి సినిమాలో అవకాశం వదులుకున్న హీరోలు!

 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపిస్తున్న హీరోలు!

Visitors Are Also Reading