Home » సుధాకర్ కొడుక్కి అండగా చిరంజీవి.. స్నేహితుడి కోసమే..!

సుధాకర్ కొడుక్కి అండగా చిరంజీవి.. స్నేహితుడి కోసమే..!

by Anji

కమెడియన్ సుధాకర్ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ.. 20 సంవత్సరాల కిందట తెలుగు సినిమాలను రెగ్యులర్ చూసిన వారికి సుధాకర్ పేరు తెలిసే ఉంటుంది. అబ్బబ్బ.. అంటూ తనదైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ సుధాకర్. తమిళంలో హీరోగా పలు సినిమాలలో నటించారు సుధాకర్.. తెలుగులో మాత్రం కమెడియన్ గా సెటిల్ అయిపోయాడు. 2000 సంవత్సరం వరకు  బిజీగా ఉండే ఆర్టిస్టుగా కొనసాగాడు. 2005 సంక్రాంతి తర్వాత సుధాకర్ తెలుగు సినిమాల్లో పెద్దగా నటించలేదు. అనారోగ్యం కారణంగా ఆయన ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటున్నారు.

ఇప్పుడు ఆయన వారసుడు బెనెటిక్ మైఖెల్ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని కారణాలవల్ల ఇప్పటివరకు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే త్వరలోనే తన వారసుడు టాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్టు సుధాకర్ తెలిపారు. తాజాగా ఓ టీవీ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా వెళ్ళిన సుధాకర్ తన వారసుడు ఇండస్ట్రీ ఎంట్రీ చిరంజీవి చేతుల మీదుగానే జరుగుతుందని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ బెస్ట్ ఫ్రెండ్స్. చెన్నైలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవారు. చిరంజీవి కంటే ముందే సుధాకర్ హీరోగా మారి సినిమాలను చేశాడట. కొన్నాళ్ల తర్వాత చిరంజీవికి సినిమా అవకాశాలు రావడం.. వరుస సూపర్ హిట్ లు సాధించడంతో మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. సుధాకర్ మాత్రం తెలుగులో కమెడియన్గా సెటిల్ అయ్యాడు. తన స్నేహితుడు చిరంజీవి హీరోగా నటించిన పలు సినిమాల్లో కామెడీయన్ గా నటించాడు సుధాకర్.

ఇక యముడికి మొగుడు సినిమాలో చిరంజీవితో కలిసి నటించడమే కాదు.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలో కూడా పాలుపంచుకున్నాడు. ప్రారంభం నుంచి చిరంజీవి సుధాకర్ మంచి స్నేహితులు కావడంతో వీరి మధ్య రిలేషన్ బాగానే ఉంది. అందుకే తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నాడట. చిరంజీవి నా మిత్రుడు.. శ్రేయోభిలాషి.. మా అబ్బాయి గురించి అప్పుడే చెప్పకూడదు కానీ.. చిరంజీవి గారే చేసి చూపిస్తారు అంటూ తన కొడుకు ఎంట్రీ గురించి చెప్పుకొచ్చాడు సుధాకర్. గతంలో తన కొడుకు కాలేజీ సీటు విషయంలో కూడా చిరంజీవి సాయం చేశారని చెప్పారు. మొత్తానికి తన స్నేహితుడి కొడుకు కెరీర్ ని తీర్చిదిద్దే బాధ్యత మెగాస్టార్ తీసుకున్నాడు అన్నమాట.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 సినిమాల్లోకి రాకముందు సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్ పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు ! తినడానికి డబ్బులు లేక ..!

 రాజమౌళి సినిమాలో అవకాశం వదులుకున్న హీరోలు!

Visitors Are Also Reading