Home » ముందు చక్రాలు లేని ట్యాంకర్.. అయినా అద్భుతంగా నడిపిన డ్రైవర్..!

ముందు చక్రాలు లేని ట్యాంకర్.. అయినా అద్భుతంగా నడిపిన డ్రైవర్..!

by Anji
Ad

సాధారణంగా ఏదైనా ట్రక్కు లేదా ట్యాంకర్ వంటివి నడవాలి అంటే ముందు భాగంలో చక్రాలు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే అలా లేకుండా నడపటం సాధ్యం కాదు.. కానీ ఓ ట్యాంకర్ డ్రైవర్ మాత్రం ముందు టైర్లు లేకుండానే ట్యాంకర్ ట్రక్కును నడిపి అందరినీ ఆశ్చపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

ఇక ఈ వీడియో ప్రకారం అప్పటికే.. ప్రమాదానికి గురైన ఓ ట్యాంకర్ కి ముందు చక్రాలు మొత్తం ఊడిపోయాయి. మిడిల్ వీల్స్ , బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ముందు చక్రాలు లేకుండా నడిపినట్టయితే.. ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కానీ ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.. అప్పటికే ప్రమాదానికి గురైంది.. ఇక ఏం పర్లేదు అనుకున్నాడో ఏమిటో.. ఆ టక్కును అలా నడుపుకుంటూ వెళ్లాడు. 

Also Read :   భార్యను ప‌ట్టించుకోకుండా మ‌రోమ‌హిళ‌తో సంబంధం….చివ‌రికి ఏ జ‌రిగిందంటే..?

రోడ్డుపై అతివేగంగా ముందు టైర్లు లేకుండా వెళ్తున్న ఈ వాహనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. హెవీ లోడ్స్ తీసుకువెళ్లే వాహనాలు, మూడు వరుసలుగా చక్రాలుంటాయి. ఫ్రంట్ వీల్స్, మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్, ముందు చక్రాలు లేకుండానే ట్రక్కు నడపడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటివి మన దేశంలోనే సాధ్యమంటూ.. కామెంట్ చేస్తున్నారు. 

Also Read :  భోగి పండుగ రోజు రేగు పళ్లను పోయడానికి కారణం ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading