Home » భోగి పండుగ రోజు రేగు పళ్లను పోయడానికి కారణం ఏంటో తెలుసా..?

భోగి పండుగ రోజు రేగు పళ్లను పోయడానికి కారణం ఏంటో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా సంక్రాంతి పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. భోగి పండుగలో ముఖ్యమైంది భోగి మంటలు ఒకటి. రెండోది భోగి పళ్లు. అసలు భోగి పళ్లు ఎందుకు పోస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

భోగి పండుగ రోజు ఉదయం బొమ్మల కొలువుతో సంబురాన్ని అంతా నట్టింట్లో కూర్చొబెట్టి సాయంత్రం అయ్యే సరికి పేరంటం చేస్తారు. ఇక ఈ సందర్భంగా భోగి పళ్లు పోస్తారు. భోగి పండుగ రోజు రేగుపళ్లు కాస్తా భోగి పళ్లుగా మారిపోతాయి. చుట్టు పక్కల ఉన్నటువంటి ముత్తయిదువులు అందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తుంటారు. దోసిలి నిండా రేగు పళ్లు, చిల్లర, చెరకు ముక్కలు, బంతి పూల రెక్కలు మూడు సార్లు తలమీదుగా దిష్టి తీసి పోస్తారు. మరికొందరూ దిష్టి తీసినవి పిల్లలపై పోయకుండా గుమ్మం బయటికి విసురుతారు. చుట్టు పక్కల ఆడుకునే పిల్లలు కొందరూ చిల్లర నాణేలు, రేగుపళ్లు ఏరుకునేందుకు పోటీ పడుతుంటారు. సాక్షాత్యూ ఆ నారాయణులు ఈ బదరి (రేగు) చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని.. ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించాడని అందుకే రేగు చెట్టుకి అంత ప్రాధాన్యత అని చెబుతుంటారు పండితులు. 

Manam News

Advertisement

మరో విషయమేంటంటే.. రేగు పళ్లను అర్కఫలం అని కూడా పిలుస్తుంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్ లో అయినా రేగు చెట్టు పెరుగుతుంది. ఈ చెట్టు ఎండ, వాన అన్నింటిని తట్టుకుంటుంది. సంక్రాంతి రోజు రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పుల్లగా ఉండే రేగు పళ్లు తినడానికి రుచిగా ఉండడమే కాదు.. వీటిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. సంప్రదాయ వైద్యంలో రేగు పళ్లది ప్రత్యేక స్థానం. జలుబు, దగ్గు నుంచి సంతానలేమి సమస్య వరకు అన్ని రుగ్మతలకు రేగు పళ్లు దివ్య ఔషదంగా భావిస్తారు. రేగు పళ్ల నుంచి వచ్చే వాసన కూడా మనస్సుని ఆహ్లాదంగా ఉంచుతుంది. 

Also Read :  గర్భిణీ స్త్రీలు జర్నీ చేయడం మంచిదేనా..?

Manam News

భోగి పళ్లను ఐదేళ్ల లోపు పిల్లలకి పోస్తారు. ఈ వయస్సులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. వీరికి రేగుపళ్లు అమృతంలా పని చేస్తాయట. విటమిన్ సి ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పెంచడమే కాదు.. జీర్ణ సంబంధిత వ్యాధులు నివారించేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు బంతి పూల రెక్కలని వాడడం వల్ల పిల్లల చుట్టూ క్రిమికీటకాలు దరి చేరవు అని చెబుతుంటారు.  బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములను చంపడం. ఇవి చర్మానికి తగిలితే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు చెబుతుంటారు. పసి పిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడం కోసమే బోఘి పళ్లు పోయడం వెనుక ఉన్న ఉద్దేశం అని చెబుతుంటారు.  

Also Read :  నీటిని పదే పదే మరిగించి తాగుతున్నారా..? అయితే ఆ ప్రమాదం పొంచి ఉన్నట్టే జాగ్రత్త..!

Visitors Are Also Reading