Home » సినిమాలలో హీరో, హీరోయిన్లు వాడే కాస్ట్యూమ్స్ ను ఏం చేస్తారో తెలుసా…?

సినిమాలలో హీరో, హీరోయిన్లు వాడే కాస్ట్యూమ్స్ ను ఏం చేస్తారో తెలుసా…?

by Bunty
Ad

సాధారణంగా ప్రతి ఒక్క సినిమాలో హీరో, హీరోయిన్లు వాడే డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నిర్మాతలు భరిస్తూ ఉంటారు. ఈ డ్రెస్సులను, నగలను కొన్ని లక్షలు, కోట్లు పెట్టి ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. సినిమాలలో ఒకసారి వాడిన దుస్తులు మరోసారి కనిపించవు. మరి సినిమాలలో షూటింగ్ అయిపోయిన అనంతరం ఆ కాస్ట్యూమ్స్ ను ఏం చేస్తారనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

Advertisement

వారే వాడుకుంటారా? లేకపోతే ఎవరికైనా ఇస్తారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ప్రతి ఒక్క సినిమాలో వాడే కాస్ట్యూమ్స్, డ్రెస్సులను హీరో హీరోయిన్లు వేసుకున్న సమయంలో వారికి నచ్చితే వారితో పాటే తీసుకెళ్తారట. ఇక మరి మరికొన్ని దుస్తులను, నగలను వేలం వేస్తారట.

Advertisement

ఈ వేలం వేయగా వచ్చిన డబ్బులను వారి అవసరాలకు ఉపయోగిస్తారట. దూకుడు సినిమా సమయంలో ప్రత్యేకంగా తయారు చేయించిన దుస్తులను సినిమా అనంతరం వేలం వేయగా వచ్చిన డబ్బులను సమంత చారిటీకి అందజేశారట. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో వాడిన పోలీస్ డ్రెస్ ను ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయడానికి వేలం వేశారట. ఇప్పుడు చాలా వరకు హీరోలు, హీరోయిన్లు వారు వాడే కాస్ట్యూమ్స్ ను వారి సొంత బోటిక్ లలో అమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…?

Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

 

Visitors Are Also Reading