Home » Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

by Bunty
Ad

ఈటీవీ పటాస్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను షోలలో అద్భుతంగా కామెడీని పండిస్తారు. తన కామెడీతో సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నాడు యాదమ్మ రాజు. ఇక రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

Advertisement

మాటీవీలో ప్రసారమయ్యే నీతోనే డాన్స్ షోలో తన భార్యతో కలిసి పార్టిసిపేట్ చేసి కామెడీతో పాటు డ్యాన్స్ ను కూడా చేయగలను అని నిరూపించడానికి నీతోనే డాన్స్ షోలో పాల్గొన్నాడు. కానీ మిగతా జంటలు వీరికన్నా బాగా డాన్స్ చేయడంతో వీరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక పెళ్లయిన కొన్ని రోజులకే స్టెల్లా తన భర్తను విడిచి యూఎస్ లో స్టడీస్ కోసం వెళ్ళింది. ఇక నీతోనే డాన్స్ షోలో ఆఫర్ రావడంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది.

Advertisement

రీసెంట్ గా స్టెల్లా సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. తన భర్త హాస్పిటల్ లో నడవలేని స్థితిలో ఉన్నాడని, తనే పట్టుకొని నడిపిస్తున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేసింది. “గెట్ వెల్ సూన్ బేబీ…నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను… అన్నింట్లో తోడుగా ఉంటాను” అని క్యాప్షన్ ను జత చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు యాదమ్మ రాజు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక కొంత మంది మాత్రం స్టెల్లా ను పెళ్లి చేసుకోవడం వల్లే యాదమ్మ రాజు కు ఇలా జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading