Home » Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

by Bunty

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాన్ మస్క్ అతి తక్కువ కాలంలోనే.. ప్రపంచ ధనికుల్లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే.. ఇటీవల ట్విట్టర్‌ ను ఎలాన్ మస్క్.. కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ట్విట్టర్ లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.

READ ALSO : నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్

వాటికి అంతు అనేది ఉండట్లేదు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఎలాన్ మస్క్ అందులో పేను సంస్కరణలకు తెరతీశారు. ఈ పరంపరను ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ లోగోను మార్చేశారు.

Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మార్పు..నీలి పిట్ట స్థానంలో జపనీస్ కుక్క ప్రత్యక్షం..నెటిజన్లకు షాక్..

బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఇమేజ్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ట్రిప్టో కరెన్సీలో ఒకటైన డోజ్ కాయిన్ లోగో గా వినియోగించే శునకం ఫోటో అది. సాధారణంగా నెటిజెన్లు మీమ్స్ సృష్టించడానికి ఫోటోలు వాడుతుంటారు. ఇప్పుడు అదే ట్విట్టర్ లోగోగా మారింది. యూజర్లు ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయగానే కొత్త లోగో దర్శనం ఇస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షన్లకు మాత్రమే ట్విట్టర్ లోగో చేంజ్ అయింది. దశలవారీగా అన్ని వర్షన్లకు ఇది అమలు అవుతుంది.

read also : Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…

Visitors Are Also Reading