Home » నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్

నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్

by Bunty
Ad

వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. కాగా సీనియర్ బాలకృష్ణకు హనీరోజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు హనీరోజ్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది.

read also : Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…

Advertisement

కాగా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డిలో నటించే అవకాశం కల్పించారు. ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే సినిమాల్లో నటించినా.. వీరసింహారెడ్డితో సాలిడ్ హిట్టును అందుకుంది హీరోయిన్ హనీ రోజ్. ముఖ్యంగా యూత్ లో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకుంది హీరోయిన్ హనీ రోజ్. ఈ నేపథ్యంలో పలు షాప్ ఓపెనింగ్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేస్తుంది. తాజాగా ఓ షోరూం ఓపెనింగ్ లో పాల్గొన్న హనీ రోజ్.. బాడీ షేమింగ్ అంశంపై మాట్లాడింది.

Advertisement

సినిమాల్లో పాత్రకు తగ్గట్లు నా డ్రెస్సింగ్ ఉంటుంది. నాకు నచ్చినట్లుగా కనిపించడానికి ఇష్టపడతా. ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ విధంగా కనిపించాలన్నది నటీనటుల పర్సనల్ ఛాయిస్. హీరోయిన్లు కాస్త బరువు పెరిగిన జనాలు ట్రోల్స్ చేస్తుంటారు. ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తూ మానసిక ఒత్తిడిని కలిగిస్తారు. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

read also : ఆ స్టార్ హీరో తో సౌందర్య డేటింగ్… ఆ ప్రేమకు కారణం ఇదే…!

Visitors Are Also Reading