Home » తల్లిదండ్రులు మరణించినా తలనీలాలు తీయని మహేష్ బాబు.. ఎందుకో తెలుసా ? 

తల్లిదండ్రులు మరణించినా తలనీలాలు తీయని మహేష్ బాబు.. ఎందుకో తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా తల్లిదండ్రులు మరణించిన సమయంలో ఎవరైనా తలనీలాలు తీస్తుంటారు. కేవలం తల్లిదండ్రులే కాదు.. వారి వంశంలో ఎవరు మరణించినా కానీ తలనీలాలు సమర్పిస్తుంటారు చాలా మంది. కొన్ని సందర్భాల్లో మాత్రం అది తీయడానికి కుదరదు. దానికి రకరకాల కారణం ఉంటుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు సోదరుడు కోల్పోయిన ఉన్నాడు. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరికీ కూడా కర్మకాండ నిర్వహించారు.

Advertisement

నిజానికి తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు ఉంటే తల్లికి చిన్న కుమారుడు, తండ్రికి పెద్ద కుమారుడు తలకొరివి పెట్టాలి. కానీ ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కరే ఉన్నారు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించాడు. అందుకే తల్లిదండ్రులకు ఇద్దరికీ మహేష్ బాబే తలకొరివి పెట్టారు. తల్లిదండ్రుల తలకొరివి పెట్టిన వ్యక్తి తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబు సమర్పించకపోవడం పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి ఇందిరా దేవి మరణించిన సమయంలో మహేష్ బాబు తలనీలాలు సమర్పిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు మహేష్ అలా చేయలేదు. నవంబర్ 27, 2022న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ నిర్వహించనున్నారు. అయితే  కర్మకాండ నిర్వహించిన మహేష్ బాబు తలనీలాలు సమర్పించే అవకాశం లేదని తెలుస్తోంది.  

Advertisement

Also Read :  క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సారిక‌తో ఎందుకు విడిపోయారు..?

దానికి కారణం మహేష్ నటించబోయే సినిమానే కారణం. వాస్తవానికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. సాధారణమైన జుట్టు రావడానికే చాలా సమయం పడుతుంది. అది కూడా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత జుట్టు రావడం అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా  త్రివిక్రమ్ సినిమా కోసమే మహేష్ బాబు తలనీలాలు ఇవ్వకుండా తాను కట్టుబడిన నిబద్ధతతో నిలబడ్డాడని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద హీరోయి అయినా, చిన్న హీరో అయినా సినిమా ప్రారంభం సమయంలోనే నిర్మాతలతో ఓ అగ్రిమెంట్ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాం.. ఎన్ని రోజులు కాల్షీట్స్ కేటాయిస్తామనే విషయాలను పొందుపరుస్తారు. మహేష్ బాబు లాంటి హీరో నేనిప్పుడు బాధలో ఉన్నాను సినిమా చేయలేనని చెబితే నిర్మాత నష్టాలు భరిస్తాడు. అందుకే మహేష్ బాబు నిబద్ధతకు మారుపేరుగా నిలబడుతూ తలనీలాలు కూాడా సమర్పించలేదని సమాచారం. 

Also Read :  “నేనే రాజు నేనే మంత్రి” సినిమాను చేతులారా వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading