Home » “నేనే రాజు నేనే మంత్రి” సినిమాను చేతులారా వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

“నేనే రాజు నేనే మంత్రి” సినిమాను చేతులారా వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించే హీరోలలో రానా కూడా ఒకరు. కేవలం హీరో పాత్రలకే పరిమితం అవ్వకుండా రానా విలన్ పాత్రలు సైతం చేస్తున్నాడు. అంతే కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ ఉంటారు. బాహుబలి సినిమాలో విలన్ గా నటించి దేశవ్యాప్తంగా రానా అభిమానులను సంపాదించుకున్నారు.

Also Read:  నా కోడ‌లు అలాంటిది అంటూ న‌య‌నతార‌ అత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్..!

Advertisement

అయితే రానా కెరియర్ లో లీడర్ సినిమా తర్వాత మళ్లీ హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతోనే హిట్ పడింది. ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించింది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ఇక ఒకప్పుడు జయం… చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన తేజకు కూడా చాలా కాలం తర్వాత మళ్లీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ పడింది.

Also Read:  క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సారిక‌తో ఎందుకు విడిపోయారు..?

Advertisement

అయితే నిజానికి ఈ సినిమాకు మొదట తేజ రానాను హీరోగా అనుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా కథను ఓ సీనియర్ హీరోకు వినిపించారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా కథను తాను మొదటగా హీరో రాజశేఖర్ కు వినిపించానని చెప్పారు. అయితే కథ విన్న తర్వాత రాజశేఖర్ కొన్ని మార్పులు చేయాలని కోరారట.

దాంతో తేజ ఎలాంటి మార్పులు చేయకుండా అదే కథను హీరో రానాకు వినిపించాడు. రానాకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కేతరిన్ సెకండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో రాజశేఖర్ ఈ సినిమాను మిస్ చేసుకున్నారు.

Also Read: ఆ హీరోయిన్ తో నాగ‌చైత‌న్య డేటింగ్ …? నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

Visitors Are Also Reading