Telugu News » Blog » క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సారిక‌తో ఎందుకు విడిపోయారు..?

క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సారిక‌తో ఎందుకు విడిపోయారు..?

by AJAY
Published: Last Updated on
Ads

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక‌టి కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న హీరోల‌లో క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక‌రు. క‌మ‌ల్ హాసన్ ఒక‌ప్ప‌టి హీరోయిన్ సారిక‌ను సైతం వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల‌పాటూ ల‌వ్ లో మునిగితేలిన ఈ జంట 1988లో వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర‌వాత వీరికి శృతిహాసన్, అక్ష‌ర హాస‌న్ అనే ఇద్ద‌రు కూతుళ్లు జ‌న్మించారు. ప్ర‌స్తుతం శృతిహాస‌న్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుండ‌గా అక్ష‌ర‌హాస‌న్ సినిమాల్లో న‌టిస్తూ స‌క్సెస్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది.

Advertisement

Also Read: నా కోడ‌లు అలాంటిది అంటూ న‌య‌నతార‌ అత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్..!

ఇదిలా ఉంటే క‌మ‌ల్ హాస‌న్ సారిక‌కు విడాకులు ఇచ్చి సింగిల్ లైఫ్ ను గ‌డుపుతున్నాడు. దానికి ఓ కార‌ణం ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…పెళ్లి త‌ర‌వాత సారిక సినిమాల‌కు గుడ్ బై చెప్పారు. సినిమాల్లో న‌టించ‌డానికి గుడ్ బై చెప్పిన‌ప్ప‌టికీ సారిక సినిమాల‌ను మాత్రం వ‌దిలి వెళ్ల‌లేదు.

Also Read:  థమన్ మావా మళ్ళీ దొరికిపోయాడా ? వీరసింహారెడ్డి మూవీ నుండి ‘జై బాలయ్య పాట‌ అక్కడ నుంచి కాపీ ?

Advertisement

క‌మ‌ల్ హాస‌న్ సినిమాల‌కు సారిక డిజైన‌ర్ గా ప‌నిచేసేవారు. ప‌దిహేనేళ్ల వర‌కూ వీరి జంట హ్యాపీగా గ‌డిపింది. క‌మ‌ల్ సారిక సినిమా ఫంక్ష‌న్స్ లో ఫ్యామిలీ ఫంక్ష‌న్స్ లో సంద‌డి చేసేవారు. కానీ ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు రావ‌డంతో 2004 లో విడాకులు తీసుకున్నారు. త‌మ తల్లి దండ్రులు విడిపోవ‌డానికి కార‌ణం వారిద్ద‌రి అభిప్రాయాలు క‌ల‌వ‌క‌పోవ‌డ‌మే అని శృతిహాస‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

KAMALHASAN

KAMAL HASAN

ఇదిలా ఉంటే క‌మల్ హాస‌న్ సారిక తో విడిపోయిన‌ప్ప‌టికీ శృతిహాస‌న్, అక్ష‌ర‌హాస‌న్ ల బాధ్య‌త‌ల‌ను చూసుకుంటున్నారు. ఇద్ద‌రికీ ఇండ‌స్ట్రీలో స‌పోర్ట్ గా ఉంటారు. కానీ భార్య సారిక‌తో మాత్రం క‌మ‌ల్ కు పెద్ద‌గా స‌త్సంబంధాలు ఉన్న‌ట్టుగా క‌నిపించ‌వు. కాగా క‌మ‌ల్ రీసెంట్ గా విక్ర‌మ్ సినిమాతో హిట్ అందుకున్నారు. చాలా కాలం త‌ర‌వాత విక్ర‌మ్ తో మ‌రోసారి క‌మ‌ల్ హిట్ ట్రాక్ లోకి వ‌చ్చారు.

Advertisement

Also Read:  నాగశౌర్య భార్య ఆస్తి ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!