Home » మీరు టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి..!

మీరు టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి..!

by Anji
Ad

సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ, కాఫీలు తాగే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ, టీ తాగే సమయంలో చేసే కొన్ని తప్పులతో ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. టీ లేదా కాఫీ తాగేటప్పుడు కొన్ని పొరపాట్లను నేరుగా మీ అన్న వాహికను దెబ్బతీసే ప్రమాదముంది. అన్నవాహిక శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దీని ద్వారానే మనం తీసుకునే ఆహారం కడుపులోకి చేరుతుంది. అన్నవాహిక దెబ్బతింటే ఆహారం మింగడం నుంచి జీర్ణక్రియ వరకు సమస్యలు వస్తుంటాయి. టీ తాగేటప్పుడు సాధారణ తప్పులు, వాటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

వేడిగా తాగడం :

Manam News

మీరు చాలా వేడి టీ తాగాలనుకుంటే మీరు మీ అలవాటును మార్చుకోవాలి. చాలా వేడిగా ఉండే టీ తాగడం వల్ల నోటి పూత వస్తుంది. అదేవిధంగా టీని గొంతు ద్వారా మింగడం వల్ల అన్నవాహిక దెబ్బ తింటుంది. చాలా వేడి టీ తాగడం మానేయడం బెటర్.

త్వరగా తాగడం : 

Manam News

మనలో చాలా మంది ఎంతో హడావుడిగా ఉన్నట్టు టీ త్వరగా తాగేస్తుంటారు. ఓ రెండు సిప్స్ లో తాగేవాళ్లు కూడా ఉంటారు. ఇలా ఫాస్ట్ గా వేడి వేడి టీ తాగడం వల్ల కూడా అన్నవాహిక దెబ్బతినే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

టీ కి ఉప్పు కలపడం :

Manam News

Advertisement

కొంత మంది ఉప్పు కలుపుకొని టీ తాగుతారు. వాస్తవానికి ఉప్పు మీ గొంతులోకి వెళ్లి మీ అన్నవాహికను దెబ్బతీసే అవకాశముంది. టీలోని ఉప్పు కరిగి స్పటికాలను ఏర్పరుస్తుంది. దీంతో చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది.

Also Read :  రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలో మీకు తెలుసా ?

స్ట్రాంగ్ మసాలా టీ  :

Manam News

చాలా మందికి మసాలా టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్నవారు వెంటనే మానేస్తే బెటర్. వాస్తవానికి బలమైన మసాలా సుగంధ ద్రవ్యాలు మీ జీర్ణక్రియను దెబ్బతీసే అవకాశముంది. దీంతో ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా కష్టం అవుతుంది. అసలు టీలో స్ట్రాంగ్ మసాలాలను ఉపయోగించకపోవడం బెటర్.

Also Read :  ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!

పరగడుపున టీ తాగడం :

Manam News

చాలా మంది ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాకర అలవాటు. పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు పెరిగే అవకాశముంది. దీంతో యాసిటిడీ, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏదైనా అల్పహారం తీసుకున్న తరువాత టీ తాగితే మంచిది.  టీ తాగే విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారు.
Also Read :  ఉదయం టీకి బ‌దులు సొర‌కాయ జ్యూస్ తాగండి.. లాభాలెన్నో..!

Visitors Are Also Reading