Home » ఉదయం టీకి బ‌దులు సొర‌కాయ జ్యూస్ తాగండి.. లాభాలెన్నో..!

ఉదయం టీకి బ‌దులు సొర‌కాయ జ్యూస్ తాగండి.. లాభాలెన్నో..!

by Anji
Ad

ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే బెడ్ కాఫీ, టీలు తాగటం అనేది సాధార‌ణం. ఈ విధంగా టీ, కాఫీలు తాగకుండా రోజు ఏ పనిని ప్రారంభించ‌రు. టీ తాగితేనే ఏ పనైనా స్టార్ట్ చేస్తుంటారు. అలా టీ తాగడానికి అంతగా అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో టీ, కాఫీలు అనేవి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్న సొరకాయ జ్యూస్ ని టీ కి బదులుగా తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. సొరకాయ జ్యూస్ మీకు టేస్టీగా అనిపించదు. కానీ ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతినిత్యం ఎక్స‌ర్ సైజ్ చేసే వాళ్లు త‌ప్ప‌కుండా ఈ సొరకాయ జ్యూస్ ని తీసుకోవాలి.

Also Read : చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా ? నిమ్మరసంతో ఇలా చేస్తే అది మాయం..!

Advertisement

Manam

ఇది మీకు చాలా మేలు చేస్తుంది. పాల జ్యూస్ లో సహజ చక్కెర కలిగి ఉంటుంది. ఇది గ్లైకోజన్ లెవెల్స్ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ సమస్య ఉన్నట్లయితే మీరు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు దానికోసం సొరకాయ జ్యూస్ ని తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తీసుకోవడం వలన శరీరానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సొరకాయ జ్యూస్ లో 98% వాటర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని బయటకి పంపిస్తాయి. అదేవిధంగా మలబద్ధకంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సొరకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా కిడ్నీలో రాళ్లు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు నిత్యం సొరకాయ జ్యూస్ తాగడం వల్ల చాలాఉపయోగం ఉంటుంది.

Advertisement

Also Read : రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలో మీకు తెలుసా ?

Manamఅదేవిధంగా ఎవరైతే నిద్రలేని సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ జ్యూస్ ఆ సమస్యని చెక్ పెట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అధిక వేడితో బాధపడే వాళ్ళు సొరకాయ జ్యూస్ తో క్షణాల్లో శరీరం కూల్ అవుతుంది. నిత్యం సొరకాయ జ్యూస్ ని తీసుకోవడం వల్ల‌ అధిక రక్తపోటు వ్యాధి కూడా అలాగే సొరకాయ జ్యూస్తో అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే మలబద్ధకం దూరమవుతుంది. జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉంటుంది. అదేవిధంగా శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. లివర్ ని శుభ్రపరుస్తుంది. మలబద్ధకం దూరమవుతుంది. అదేవిధంగా చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా రక్షిస్తుంది. శరీరంలోని వ్యర్ధాలన్నింటిని తొలగిస్తుంది. ఇంకెందుకు ఆల‌స్యం సోర‌కాయ జ్యూస్‌ని తాగ‌డం ప్రారంభించండి.

Also Read : Chanakya nithi: స్త్రీలు ఎలాంటి పురుషులను ఇష్టపడతారంటే..?

 

Visitors Are Also Reading