పొద్దు పొద్దున్నే సూర్య కిరణాలు మన ఇంట్లోకి వస్తే చాలా మంచిదని అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కిరణాలు ఇంట్లో పడకుంటే ఏం జరుగుతుంది.. పడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..? హిందూ సాంప్రదాయం ప్రకారం నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ యొక్క గ్రహాలు వ్యక్తి యొక్క జీవితం నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు ఈ యొక్క 9 గ్రహాలు మనుషుల యొక్క జీవితాన్ని నియంత్రిస్తాయి.
జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి మంచి చెడులను నిర్ణయిస్తాయని అంటుంటారు జ్యోతిష్య నిపుణులు. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ సూర్యభగవానుని తప్పకుండా పూజించాలి. అయితే చాలా మందికి సూర్యభగవానున్ని ఎలా పూజించాలో తెలియదు. సూర్యకిరణాలు ఇంట్లో పడకపోతే ఆ ఇంట్లో దరిద్రం పెరుగుతుంది. సూర్య కిరణాలు ఇంట్లో పడితే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే సూర్యభగవానునికి పూజ చేస్తే ఇంట్లో దరిద్రం పోతుంది.
Advertisement
Advertisement
తూర్పు వైపు తిరిగి ఉండే గ్రహాల్లో సూర్యుడు మధ్య స్థానంలో ఉంటాడు. సూర్యుడి యొక్క వాహనం ఏడు గుర్రాలు నడిపే రథం. ఈ ఒక్క ఏడు గుర్రాలు ఇంద్రధనస్సులోని రంగులు. అయితే సూర్యుని ప్రతిరోజు పొద్దున్నే స్నానమాచరించి నమస్కరిస్తే అనేక లాభాలు కలుగుతాయి. సూర్యకిరణాల వల్ల రోగకారక క్రిములు కూడా నశిస్తాయని నమ్ముతారు. అందుకే సూర్యకిరణాలు ఇంట్లో పడితే ఆరోగ్యంగా ఉంటారని, ఇంటికి ప్రధాన ద్వారాన్ని తూర్పువైపున పెడతారు.
ALSO READ;
శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఒక్క ఎపిసోడ్ ను ఎన్ని రోజులు షూట్ చేస్తారో మీకు తెలుసా..?
ఆ హీరోయిన్ విషయంలో బాలకృష్ణ రవితేజను కొట్టారా..? అసలేం జరిగింది..!