టాలీవుడ్ లో కొన్నిరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆ వార్తలు నిజమేనని ప్రేక్షకులు సైతం అనుకునేలా బలంగా వినిపిస్తూ ఉంటాయి. అలా రవితేజ బాలకృష్ణ లపై కూడా ఓ వార్త చక్కర్లు కొట్టేది. బాలకృష్ణ రవితేజను కొట్టారు అంటూ అప్పట్లో ఓ వార్త సంచలనం రేపింది. అంతే కాకుండా బాలకృష్ణ రవితేజను ఒక హీరోయిన్ విషయంలో కొట్టాడు అంటూ వినిపించడంతో దానికి ఇంకా మసాలా కలిసినట్టయ్యింది.
దాంతో ఈ వార్త సెస్సేషన్ అయ్యింది. అయితే దీనిపై తాజాగా ప్రముఖ రచయిత బీఎస్వి రవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. బాలకృష్ణ రవితేజను కొట్టారంట కదా దాంతో వారిద్దరి మధ్య మాటలు లేవంట కదా అంటూ యాంకర్ ప్రశ్నించారు. దాంతో బీవీఎస్ రవి మాట్లాడుతూ…తనకు తెలిసినంత వరకూ ఇది రూమర్ అని చెప్పారు.
రవితేజతో తాను దాదాపుగా రెండు రోజులకు ఒకసారైనా మాట్లాడతానని బీవీఎస్ రవి చెప్పారు. ఎంతో సన్నిహితంగా ఉండే తనకే ఈ విషయం తెలియదని అంటే ఇది పక్కా రూమర్ అని చెప్పారు. అంతే కాకుండా రవితేజ బాలకృష్ణ తనకు తెలిసే మూడు సార్లు మాట్లాడుకున్నారని చెప్పారు. ఓపారి విమానంలో పారిస్ కు వెళుతున్నప్పుడు కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు పార్క్ హయత్ లో ఇచ్చారని ఆ పార్టీకి బాలయ్య రవితేజ ఇద్దరూ వచ్చి అందరితో సరదాగా ఉంటూ మాట్లాడుకున్నారని చెప్పారు. అదే విధంగా భద్ర సినిమా కథను వినేటప్పుడు కూడా రవితేజ తో పాటూ బాలకృష్ణ మరికొందరు నటులు ఉన్నారని చెప్పారు. ఇది జరిగి చాలా కాలం అయ్యిందని వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ చెప్పారు.వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆహా టాక్ షోకు మధ్య కూడా ఇలాంటి వార్తలు వినిపించాయని కానీ బాలయ్య యాంకర్ అని తెలియగానే రవితేజ ఫుల్ బిజీగా ఉన్నా వచ్చారని చెప్పారు.
ALSO READ :
చైతూ కు పోటీగా వస్తున్న సమంత…ఎవరు గెలుస్తారో ..!
ఈ సమాజం అబద్ధాలనే నమ్ముతుంది….వైరల్ అవుతున్న సమంత పోస్ట్….!