Home » శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఒక్క ఎపిసోడ్ ను ఎన్ని రోజులు షూట్ చేస్తారో మీకు తెలుసా..?

శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఒక్క ఎపిసోడ్ ను ఎన్ని రోజులు షూట్ చేస్తారో మీకు తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా ఈటీవీలో వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ వంటి ప్రోగ్రామ్‌ను షూటింగ్ ఎక్కువ రోజులే స‌మ‌యం తీసుకుంటుంది. ముఖ్యంగా ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ కంటే ఎక్కువ‌గా ఈ మ‌ధ్య‌కాలంలో శ్రీ‌దేవి డ్రామా కంపెనీ స‌క్సెస్ సాధిస్తుంది. గ‌తంలో బ‌జ‌ర్ద‌స్త్ మాద‌రిగా కామెడితో అల‌రించ‌ల‌క‌పోతుందంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలోనే ఈటీవీ వారు మ‌ల్లెమాల వారు క‌లిసి శ్రీ‌దేవి డ్రామా కంపెనీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ షో ప్ర‌తి ఆదివారం టెలికాస్ట్ అవుతోంది. ఈ షో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ వినోదంను అందిస్తుంది. క‌న్నుల పండుగ అన్న‌ట్టుగా స్క్రీన్ నిండా కమెడియ‌న్స్ సీనియ‌ర్ స్టార్స్ క‌నిపిస్తుండ‌డంతో ప్ర‌స్తుతం ఈ షోకు మంచి రేటింగ్ ద‌క్కుతోంది.

Advertisement

చాలా మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌ని చేసే శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఎన్ని రోజులు జ‌రుపుకుంటుంది. అసలు షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతుంద‌ని చాలా మందికి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు విష‌యం ఏమిటంటే.. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ఒక్క ఎపిసోడ్ కేవ‌లం ఒకే ఒక్క‌రోజులోనే పూర్తి చేస్తార‌ట‌. ఏమైనా ప్ర‌త్యేకంగా డ్యాన్స్ లు లేదా ఔట్‌డోర్ షూట్‌లుంటే అద‌నంగా మ‌రొక రోజు ప‌ట్టే అవ‌కాశ‌ముంటుంది. అంత‌మంది కాల్షీట్లు రెండు లేదా మూడు రోజులు అంత‌కు మించి ఎక్కువ రోజులు ఒక్క ఎపిసోడ్ కు తీసుకుంటే మ‌ల్లెమాల ఈటీవీ వారికి వ‌చ్చే మొత్తం కూడా స‌రిపోదు.

Advertisement

శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ప్ర‌తి ఎపిసోడ్ కూడా ఒక్క రోజులో పూర్త‌య్యేవిధంగా ప్లాన్ చేస్తారు. అలా రెండు మూడు రోజుల్లో మూడు నుంచి నాలుగు ఎపిసోడ్స్ ను లాగించే విదంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. ఈటీవీ మ‌ల్లెమాల వారు చాలా ప‌క్క‌గా ఈ షోను నిర్వ‌హిస్తుండ‌డం వ‌ల్ల ఎంతో మంది టాలెంట్ ఉన్న‌వారు బ‌య‌ట‌కొస్తున్నారు. ఈ షో కేవ‌లం కామెడితో మాత్ర‌మే కాకుండా డాన్స్‌ల‌తో కూడా అల‌రిస్తుంది. అదేవిధంగా సెంటిమెంట్‌తో క‌న్నీళ్లు పెట్టిస్తుంది. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో నిరూపిత‌మైంది కూడా. ఇలా అన్ని ఉండ‌డం వ‌ల్ల‌నే ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్‌ను మించి ఈ షో పాపుల‌ర్ కావ‌డం విశేషం.

Also Read : 

ఆ హీరోయిన్ విష‌యంలో బాల‌కృష్ణ ర‌వితేజ‌ను కొట్టారా..? అస‌లేం జ‌రిగింది..!

మీకు గుర‌క స‌మ‌స్య ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

Visitors Are Also Reading