Home » ఆచార్యలో కాజ‌ల్ లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

ఆచార్యలో కాజ‌ల్ లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సినిమా ఆచార్య‌. ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు ఇవాళ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ తొలిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసాడు.


తొలుత ఈ చిత్రంలో కాజ‌ల్‌ను హీరోయిన్‌గా ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. ఆ త‌రువాత సినిమా నుంచి కాజ‌ల్ రోల్ తీసార‌ని ప‌లు రుమార్లు వ‌చ్చాయి. ఆ రూమ‌ర్లు నిజమ‌య్యాయి. ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్లారిటీ ఇచ్చారు. ఆచార్య సినిమాలో కాజ‌ల్ ను తీసుకున్న విష‌యం వాస్త‌వ‌మే. కానీ తొలి షెడ్యూల్ పూర్త‌యిన త‌రువాత ఆమె పాత్ర సంతృప్తిక‌రంగా అనిపించ‌లేద‌ని.. చిరు పాత్ర‌కు ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ లేద‌ని.. కాజ‌ల్‌ను బ‌ల‌వంతంగా చేర్చుతున్న‌ట్టు అనిపించ‌డంతో ఆమె పాత్ర‌ను తొల‌గించిన‌ట్టు కొర‌టాల వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

ఇక ఈ విష‌యాన్ని కాజ‌ల్‌కు చెప్ప‌గానే.. ఆమె కూడా చిరున‌వ్వుతో ప‌క్క‌కు త‌ప్పుకున్న‌దని పేర్కొన్నారు. వాస్త‌వానికి కాజ‌ల్ సైలెన్స్ వెనుక రీజ‌న్ వేరే ఉంటుంద‌ని కొంద‌రూ పేర్కొంటున్నారు. వాస్త‌వానికి ఇందులో కాజ‌ల్ న‌టించ‌న‌ప్ప‌టికీ త‌న పారితోష‌కాన్ని పూర్తిగా తీసుకున్న‌ద‌ని టాక్ వినిపిస్తోంది. ఆచార్య కోసం దాదాపు కాజ‌ల్ ఓ సినిమాకు తీసుకునే రెమ్యూన‌రేష‌న్ అనుకుంద‌ట. కోటిన్న‌ర త‌న ఖాతాలో వేసుకోవ‌డంతోనే కాజ‌ల్ కాముగా ఉంద‌ని టాక్. ఇటీవ‌ల పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్ కొడుకుకు నీల్ కిచ్లు అని పేరు పెట్టారు.

Also Read : 

ACHARYA MOVIE REVIEW : ఆచార్య రివ్యూ అండ్ రేటింగ్ ..!

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ప్ర‌భాస్ హీరోయిన్…వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

Visitors Are Also Reading