Home » ACHARYA MOVIE REVIEW : ఆచార్య రివ్యూ అండ్ రేటింగ్ ..!

ACHARYA MOVIE REVIEW : ఆచార్య రివ్యూ అండ్ రేటింగ్ ..!

by AJAY
Ad

ACHARYA MOVIE REVIEW

సినిమా- ఆచార్య

నటీనటులు -చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, మరికొందరు.

Advertisement

దర్శకుడు -కొరటాల శివ

సంగీత దర్శకుడు- మణిశర్మ

బ్యానర్, నిర్మాత – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు రామ్ చరణ్.

పరిచయం :
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత, సైరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూడో సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు కొరటాల శివకు ఫ్లాప్ అంటే తెలియదు. మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం కొరటాల డైరెక్టర్ కావడంతో ఆచార్య పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను రీచ్ అయిందా…? లేదా…? అన్నది ఇప్పుడు చూద్దాం.

క‌థ :
ధర్మస్థలి అనే పట్టణంలో ఉండే ఆలయం చుట్టూ ఆచార్య సినిమా కథ తిరుగుతుంది. ధర్మస్థలి పట్టణంలో భ‌స‌వ‌ సోను సూద్ అనే విలన్ ఉంటాడు. అతడి నిరంకుశ పాలన నుండి ద‌ర్మ‌స్థ‌లిని రక్షించేందుకు ఆచార్య చిరంజీవి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఆచార్య భ‌స‌వ‌ను ఎలా ఎదిరిస్తాడు… అస‌లు రామ్ చరణ్ చిరంజీవి మధ్య అసలు సంబంధం ఏంటి..? అన్నదే ఈ సినిమా అసలు కథ.

విశ్లేషణ :

కొరటాల సినిమా నుండి ఆశించే ఎమోషనల్ సన్నివేశాలు గానీ…మెసేజ్ లు గానీ ఆచార్య సినిమాలో కనిపించలేదు. అసలు సినిమా కథనే కొరటాల బలహీనంగా రాసుకున్నట్టు కనిపిస్తుంది. స్టోరీ లైన్ అంతా ముందే ఊహించే విధంగా ఉంటుంది. దాంతో ప్రేక్షకుడికి ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండదు. సినిమాలో చిరంజీవి గెటప్ మరియు ఆయన చేసే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. కానీ సినిమా కథ బలహీనంగా ఉండటంతో ఆ సీన్లు కాస్త నీరసంగానే కనిపిస్తాయి.

Advertisement

ACHARYA MOVIE REVIEW

ACHARYA MOVIE REVIEW

సినిమాలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. అసలు ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వం వహించారా లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్లతో తీపించారా అనే అనుమానాలు కూడా వస్తాయి. కథ బలహీనంగా రాసుకున్నప్పటికి స్క్రీన్ ప్లే కూడా అంతకంటే బలహీనంగా కన‌పిస్తుంది. మణిశర్మ అందించిన స్వరాలలో బలే బంజారా పాట తప్ప మరే పాట కూడా ఆక‌ట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. సినిమా కి వెళ్లే ప్రతి ఒకరు రామ్ చరణ్ చిరంజీవి లను స్క్రీన్ చూడాలని వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాల కోసం వెళ్తారు.

ఈ సినిమాలో ఇద్దరు కలిసి దాదాపు 40 నిమిషాలు నటించడంతో ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఆ ఆశలు కూడా ఫలించలేదు. భలే బంజారా పాట తప్ప చిరంజీవి రామ్ చరణ్ ల మధ్య చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. సినిమా ఫస్టాఫ్ బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో బాగుంటుందేమో అనే భావన కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ కూడా ప్రేక్షకుడికి నిరాశ తెప్పిస్తుంది. క్లామాక్స్ లెంతిగా సాగదీసినట్టుగా ఉంటుంది. దాంతో థియేటర్ నుండి ఎప్పుడు భ‌య‌ట‌ పడదామా అనే భావన కలుగుతుంది. మొత్తానికి ఆచార్య కొర‌టాల‌కు గుణ‌పాటం చెప్పిన సినిమాలా క‌నిపిస్తుంది.

also read :

స‌మంత‌కు అక్కినేనివారి శాపం త‌గిలిందా..? అందుకే అలా జ‌రుగుతోందా..!

అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్ట‌ప‌డే 5ల‌క్ష‌ణాలు ఏంటో తెలుసా…!

Visitors Are Also Reading