Home » క్యాబ్ డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేయడం నేరమని మీకు తెలుసా…?

క్యాబ్ డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేయడం నేరమని మీకు తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

టెక్నాలజీ పుణ్యమా అని ప్రస్తుతం నగరాలు పట్టణాల్లో ఇలా బుక్ చేస్తే అలా క్యాబ్ వచ్చి ఇంటిముందు ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం క్యాబ్ డ్రైవర్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత వస్తున్నాం 5నిమిషాల్లో ముందు ఉంటామని చెప్పి ఎంతసేపటికీ రారు. మళ్ళీ కాల్ చేస్తే మీ లొకేషన్ ఎక్కడ అంటూ ప్రశ్నలు వేస్తారు. లొకేషన్ చెప్పిన తర్వాత వారికి గిట్టుబాటు అనిపించకపోయనా ఇతర కారణాల వల్ల రాలేమని క్యాన్సల్ చేసుకోండని చెబుతుంటారు.

అయితే అలా క్యాబ్ డ్రైవర్ బుకింగ్ క్యాన్సల్ చేయడం నేరమని మీకు తెలుసా..? అతడు రైడ్ రద్దు చేయడం వల్ల అతడికి కోర్టు జరిమానా విధిస్తుంది అన్న సంగతి తెలుసా..? ఒకవేళ మీరు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేసి ఇబ్బంది పెడితే ఇలా చేయండి. బుకింగ్ కన్ఫామ్ అయిన వెంటనే క్యాబ్ నెంబర్ తో సహా డ్రైవర్ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యాబ్ డ్రైవర్ ఒకవేళ మీ గమ్యాన్ని అడిగితే షేర్ చేయండి.

Advertisement

Advertisement

ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ రైడ్ ను రద్దు చేసినా లేదంటే మీ గమ్యస్థానం ను తెలుసుకుని ఆ తర్వాత రానని చెప్పినా… క్యాబ్ నంబర్, బుకింగ్ చేసిన సమయం, తేదీ, ఎక్కడి నుండి ఎక్కడి వరకు బుక్ చేశారనే వివరాలను స్క్రీన్ షాట్ తీసి మీ నగర ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయండి. లేదా వాట్సాప్ ద్వారా అయినా స్క్రీన్ షాట్ ను పోలిసులకు షేర్ చేయండి. బుకింగ్ చేసుకున్న తరవాత కారణాలు చెప్పి డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేయడం నేరం…మోటార్ వెహికిల్ చట్టం 1988 సెక్షన్ 178 ప్రకారం క్యాబ్ డ్రైవర్ కు కోర్టు జరిమానా విధిస్తుంది.

Also Read: ఎడాది త‌ర్వాత ఇంటికొచ్చిన భ‌ర్త‌కు ఎదురైన అనుభ‌వం!

Visitors Are Also Reading