రెండవ టీ-20 లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంకతో టీ-20 సిరీస్ ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (1) ఔట్ అయ్యాడు. ఆ తరువాత 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ పెవిలియన్ కు చేరాడు. అనంతరం సంజూ శాంసన్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
Also Read : తెలంగాణలో మరొక ఉద్యమం.. వెనక్కి తగ్గేదెలే అంటున్న ప్రభుత్వం..!
Advertisement
Advertisement
మూడవ వికెట్‌కు ఈ జోడీ 84 పరుగులు జోడించింది. ఆ తరువాత 39 రన్స్ చేసిన సంజూ ఔట్ అయ్యాడు. చివరలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన జడేజా 45 నాటౌట్ శ్రేయస్‌తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. విండిస్ బౌలర్లలో కుమార 2, చమీర 1 వికెట్ తీసారు. అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నిస్సంక 75, షనక 45, గుణతిలక 38 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్, బుమ్రా, జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
Read Also : కుల మతాల పేరుతో ఇంకెన్నిరోజులు రెచ్చగొడతారు…ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు..!