ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ తరుణంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సీఎం జగన్‌తో పాటు చర్చించారు. ఈనెల 10న సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం నిర్వహించే విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్‌తో సినిమాటో గ్రఫీ మంత్రి నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నాని కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సినిమా టికెట్ల పెంపు అంశం ప్రస్తావనకు వచ్చింది.
Also Read : ఇండియాలో మ్యాచ్ జరిగితే రెండు సీట్లు లతా మంగేష్కర్ కోసమేనట.. ఎందుకో తెలుసా..?
Advertisement
Advertisement
సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయనంపై చర్చించారు మంత్రి పేర్నినాని. ఫిబ్రవరి 10న సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సీనీ పెద్దలు సమావేశం కానున్నారు. దీనిపైనే ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. సినిమా టికెట్ల కనీస ధర గరిష్ట ధరలు ఎంత ఉండాలనే అంశంపై చర్చించారని తెలుస్తోంది. సినీ ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నది ప్రభుత్వం. సినిమా థియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపై చర్చ జరిగినట్టు సమాచారం.
Also Read : సీరియల్ గా ETV రిజెక్ట్ చేసిన ఆ కథ! తెలుగు ఇండస్ట్రీనే షేక్ చేసింది.