Home » సీరియ‌ల్ గా ETV రిజెక్ట్ చేసిన ఆ క‌థ‌! తెలుగు ఇండ‌స్ట్రీనే షేక్ చేసింది.

సీరియ‌ల్ గా ETV రిజెక్ట్ చేసిన ఆ క‌థ‌! తెలుగు ఇండ‌స్ట్రీనే షేక్ చేసింది.

by Azhar
Ad

ఊరంతా అప్పులు చేసి చ‌నిపోయిన ఓ వ్య‌క్తి అంతిమ‌యాత్ర‌కు ఊరు ఊరంతా క‌లిసి వ‌స్తుంది. రీజ‌న్ ఏంటంటే ఆయన జీవించినన్నాళ్ళూ ప్ర‌తి ఒక్క‌రూ బాగుండాలని కోరుకున్నారు. అడిగిన వారికి లేద‌న‌కుండా స‌హాయం చేశారు. అందుకే ఊరు ఊరంతా త‌న వెంట న‌డిచింది. ఈ స్టోరికి ఇంకాస్త ఎమోష‌నల్ ట‌చ్ ఇచ్చి మ‌ద‌న్ అనే రైట‌ర్ క‌థ రాసుకున్నాడు.

Also Read: హైద‌రాబాద్ బౌల‌ర్ సిరాజ్‌ను అప్పుడు అంత‌లా దూషించార‌ట‌..!

Advertisement

ఇదే క‌థ‌ను ETV ఆఫీస్ కి వెళ్లి చెప్పాడు. టైటిల్ ‘అంతిమయాత్ర’. స్టార్టింగ్ లోనే చావు సీన్ ఉండ‌డంతో ETV లో సీరియ‌ల్ తీసే డైరెక్ట‌ర్ ఈ క‌థ‌తో 26 ఎపిసోడ్ల సీరియ‌ల్ తీయ‌లేమ‌ని క‌థ‌ను రిజెక్ట్ చేశాడు. ఇదే క‌థ‌ను ప్ర‌కాశ్ రాజ్ కు వినిపిస్తే ఈ క‌థ‌ను సినిమాలా తీయ‌డం కంటే న‌వ‌ల‌లా రాస్తే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చారు.

Advertisement

ఫైన‌ల్ గా క‌థ చంద్ర సిద్ధార్థ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అత‌ని క‌థ న‌చ్చ‌డంతో సినిమా తీయ‌డానికి రెడీ అయిపోయారు. ప్ర‌ధాన పాత్ర అయిన ర‌ఘురామ్ క్యారెక్ట‌ర్ కు రాజేంద్ర ప్ర‌సాద్ ను ఫిక్స్ చేసుకున్నారు. అత‌నికి భార్య‌గా అమ‌నిని ఫైన‌ల్ చేసుకొని అంతిమ‌యాత్ర అనే టైటిల్ ను ఆ న‌లుగురు అని మార్చారు.

2004 డిసెంబర్ 9న‌ ‘ఆ నలుగురు’ సినిమా రిలీజ్ అయ్యింది. 27 ప్రింట్లలో 16 రిటర్న్ అయ్యాయి. సినిమా జ‌నాల‌కు న‌చ్చ‌లేద‌ని అనుకున్నారంతా రెండు వారాల త‌ర్వాత ఒక్క‌సారిగా సినిమా పుంజుకుంది. 4షోస్ హౌజ్ ఫుల్ బోర్డ్ తో న‌డిచింది. స్టోరికి జ‌నాలు క‌నెక్ట్ అయిపోయారు. ర‌ఘురామ్ పాత్ర‌కు గాను రాజేంద్ర‌ప్రసాద్ కు కోట‌య్య పాత్ర‌కు గాను కోట శ్రీనివాస రావుకు 2004 నంది పుర‌స్కారాలు ల‌భించాయి.

Also Read: ఇండియాలో మ్యాచ్ జ‌రిగితే రెండు సీట్లు ల‌తా మంగేష్క‌ర్ కోసమేన‌ట‌.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading