Home » మిస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ.. విజయానికి వయస్సుతో పని లేదు..!

మిస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ.. విజయానికి వయస్సుతో పని లేదు..!

by Anji
Ad

సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొనే వారు టీనేజర్లు ఎక్కువగా కనిపిస్తారు.  ఈ మధ్య కాలంలో కాస్త ముందడుగు వేసి పెళ్లి అయిన వారు కూడా   పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు. ఐదు పదుల వయస్సులో ఇద్దరూ పిల్లల తల్లి అందాల పోటీలలో పాల్గొని శభాష్ అనిపించుకుంది.  జమ్మూ నగరానికి చెందిన 55 ఏళ్ల రూపికా గ్రోవర్ మోడల్ మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ 2023 అందాల పోటీలో గెలిచి చరిత్ర సృష్టించింది. సక్సెస్ కి వయోపరిమితి ఉండదని ప్రూవ్ చేసింది. ప్రతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఆమె నటన, మోడలింగ్ ప్రపంచంలోకి చాలా నిర్ణయంగా అడుగుపెట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్న ధీశాలి. బాలీవుడ్ దిగ్గజ నటులు అమితా బచ్చన్, రణవీర్ సింగ్ వంటి లెజెండరీ నటులతో కలిసి పనిచేసింది. అంతేకాదు.. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కూడా.

Advertisement


ఇక రూపికా గ్రోవర్ ఫిట్ క్లాసిక్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్లాసిక్, టాలెంటెడ్ క్లాసిక్ వంటి టైటిల్లను కూడా దక్కించుకున్న టాలెంటెడ్ మహిళ. ఇద్దరు పిల్లల తల్లిగాను అలాగే తన కెరీర్ పరంగా అచంచలంగా దూసుకుపోతూ మహిళ సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ ఆమె కనబరిచిన అచంచలమైన నిబద్ధత, అంకితభావాలే ఆ విజయాల పరంపరను తెలియజేస్తున్నాయి. ఆమె విజయగాథ ఎలాంటి పరిస్థితిలోనైనా తమ డ్రీమ్స్ ని వదులుకోకుండా కృషి చేయాలని తెలుపుతోంది. దేనిలోనైనా విజయం సాధించాలంటే అటెన్షన్ ఉంటే చాలు. వయసుతో సంబంధం లేదని చాటి చెప్పింది.

Advertisement

ఇక ఈ మిసెస్ ఇండియా వన్ ఏ మిలియన్ అనేది దేశంలో వివాహిత మహిళల కోసం ప్రత్యేకంగా కండక్ట్ చేస్తున్న అందాల పోటీ. ఇది మహిళలంతా విజేతలే అనే లక్ష్యంగా ఈ పోటీలను పెడుతోంది. తమ కళలను వాస్తవంలోకి తీసుకురాలేకపోయిన మహిళలకు ఇదొక గొప్ప వేదిక. ఈ పోటీల్లో రూపికా గ్రోవర్ చారిత్రాత్మక విజయాన్ని సాధించి మహిళలందరికీ ప్రేరణగా నిలిచింది. ఆమె లాంటి ఎందరో మహిళలు ధైర్యంగా తమ కలలను నెరవేర్చుకునేందుకు రూపికా గ్రోవర్ గెలుపే స్ఫూర్తినిస్తుంది.

 

Visitors Are Also Reading