మరో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌కు కరోనా

మరో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌కు కరోనా

దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా వైర‌స్ కేసులు భారీగానే న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో 20ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదైన విష‌యం విదిత‌మే. అయితే క‌రోనాకు పేద‌, ధ‌నిక అనే తేడా లేదు.. సామాన్యులు మొద‌లుకొని ఉద్యోగులు, సినీ, క్రీడా ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా అంద‌రినీ క‌రోనా వెంటాడుతోంది. దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర‌మంత్రులకు క‌రోనా సోకిన విష‌యం విదిత‌మే.. అయితే తాజాగా మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 60 ఏళ్ళ ఈ కేంద్ర మంత్రి రాజస్థాన్ లోని బికనేర్ నుంచి ఎంపీ గా ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులకు కేంద్రంలో కరోనా రాగా, ఈయన నాలుగో మంత్రి. హోం శాఖా మంత్రి అమిత్ షా కు ఇప్పటికే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ధర్మేంద్ర ప్రాధాన్, కైలాష్ చౌదరి కూడా కరోనా బారిన పడ్డారు. వీరిలో అమిత్ షా కు మాత్రమే లక్షణాలు కనపడలేదు. అయితే వైద్య విభాగానికి చెందిన డాక్టర్ నీరజ్ నిశ్చ‌ల్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ చికిత్స పొందుతున్నారు.