ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దు అంటున్న ఈటెల

minister said don't go to private hospitals

కరోనా చికిత్స కొరకు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టొద్దని వైద్యశారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, దురదృష్టవషాత్తు ఒకరు చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏదో జరుగుతుందని ఊహోంచొద్దని ఆయన అన్నారు.
సిఎం ఆదేశాలతో రాష్ట్రంలో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన అన్నారు. వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న 50వేల టెస్టుల శాంపిల్ కార్యక్రమాన్ని నేటి నుంచి తిరిగి పుఃన ప్రారంభిస్తామన్నారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో సోమవారం సిఎస్ సోమేష్‌కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డా శాంతకుమారితో కలసి మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ. గత మూడు నెలల నుంచి దేశంలో మరణాలు ఎక్కువగా లేవని, దేశంలో డెత్ రేట్ 3 శాతం ఉంటే తెలంగాణ లో 1.7 శాతం మాత్రమే ఉందన్నారు. ఢిల్లీ, ముంబై, కలకత్తాతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కేసులతు తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. ఐసిఎంఆర్(ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అండ్ రీసెర్చ్) నిబంధనల ప్రకారం అసింప్టమాటిక్ రోగులకు హోమ్ ఐసోలేషన్ లో పెట్టి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ -కంటైన్మెంట్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారన్నారు. అవసరం అయితే హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ పెడతామని సీఎం అన్నారని మంత్రి తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. వైద్యమౌళిక సదుపాయాల మెరుగుపడటం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డా శాంతకుమారి మాట్లాడుతూ.ప్రస్తుతం 9వేలకు పైగా రోగులున్నారని, పాజిటివ్ రోగుల్లో చాలా మందికి ఇంటి వద్దనే వైద్యం అందిస్తున్నట్లు ఆమె అన్నారు. వీరిలో ఇప్పటికే 5వేల మంది కోలుకున్నారని ఆమె పేర్కొన్నారు.
దుష్ప్రచారం చేస్తున్నారు
ప్రభుత్వ హాస్పిటల్ లలో రోగులను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, ఇలా చేయడం కరెక్ట్ కాదని మంత్రి అన్నారు. అలాంటి ప్రచారం వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు. ఇది ప్రజలకు నష్టం చేస్తుంది అని తెలిపారు. ఇలా పని కట్టుకొని ప్రచారం చేస్తున్న వారి మాటలను ప్రజలు నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆదివారం చెస్ట్ హాస్పిటల్ లో మరణించిన వ్యక్తి అనేక ఆసుపత్రులు తిరిగి చెస్ట్ హాస్పిటల్ కి వచ్చాడని, అర్ధరాత్రి వచ్చినా కూడా జాయిన్ చేసుకొని చికిత్స అందించామన్నారు.
కానీ గుండె సమస్య తో చనిపోయారని తెలిపారు. కానీ అతనికి ఆక్సిజన్ అందలేదన్నారు. ఆ వీడియో గమనిస్తే అతనికి ముక్కులో ఆక్సిజన్ పైప్ ఉన్న సంగతి కనిపిస్తుందని తెలిపారు. ఇదే ఆసుపత్రిలో కరోనా పేషంట్లకు చికిత్స అందించి కరోనా బారిన పడి హెడ్ నర్స్ విక్టోరియా ప్రాణాలు కొల్పోవడం బాధాకరమన్నారు. ఇలా వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తుంటే విమర్శలు చేయడం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది, డాక్టర్స్ మనోధైర్యం దెబ్బతీస్తుందని అన్నారు. కరోనా వచ్చిన వారిలో ఇతర ఆరోగ్యసమస్యలు ఉంటేనే చనిపోతున్నారన్నారు.

పరీక్షలు అవసరం అయిన వారందరికీ టెస్టులు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రైవేట్ ల్యాబ్ లో చేస్తున్న పరీక్షలలో 70 శాతం పాజిటివ్ రావడం గమనించామన్నారు. ఇది చాలా ఎక్కువని ఆ ల్యాబ్‌ల మీద నిపుణులతో పరిశీలన చేయిస్తున్నామన్నారు. రిపోర్టులలో తేడాలు ఉంటే సదరు ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రోజుకు 4వేల టెస్టులు చేస్తున్నామన్నారు. టెస్టులు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రైవేట్ ల్యాబ్ లలో లోపాలను సరిచేసేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా టెస్టులు నిర్వహిస్తున్నారు. అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా టెస్టులు చేస్తున్నామని అన్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలి లేదంటే అవసరం లేదని మంత్రి అన్నారు. కరోనా రాగానే భయపడాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉండి నయం చేయించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఎమర్జెన్సీ అయితే 104 నెంబర్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి పికప్ చేసుకుంటుందని తెలిపారు. అవసరం అయితే మరిన్ని అంబులెన్స్ లు పెంచుతామన్నారు.

ప్రభుత్వం ఆసుపత్రుల్లో 17081 బెడ్స్ సిద్దంగా ఉన్నాయని మంత్రి అన్నారు. అందులో 10 వేల బెడ్స్‌కి ఆక్సిజన్ సప్లయ్ అందుబాటులో ఉందన్నారు. సిఎం అనుమతితో ఇప్పటికే 4700 మంది వైద్య సిబ్బంది నియామకం చేశామని మంత్రి తెలిపారు. కొత్తగా 150 అంబులెన్స్ కూడా సమకూర్చుకున్నామని తెలిపారు. ఒక్కరు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేసే సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని మంత్రి అన్నారు. ప్రస్తుతం గాంధీలో 2వేల బెడ్లు ఉంటే , 600 మంది రోగులు మాత్రమే ఉన్నారని మంత్రి తెలిపారు.