వన్య జీవుల వధ

Updated By ManamMon, 11/05/2018 - 00:08
Wildlife

imageమన జీవావరణం జీవికకై పోరాడుతోంది. జీవ పరిణామక్రమంలో భాగంగా కాక, బౌద్ధికావరణం (నూ స్పియర్) (మానవ కార్యకలాపాల పరిధి) ప్రభావంతో జీవావరణం అంతరించిపోయే దశకు చేరువవుతోంది. విద్యుద్ఘాతంతో ఒడిశా రాష్ట్రంలోని దెన్‌కనాల్ జిల్లా కమలం గ్రామ శివార్లలో అక్టో బర్ 27న ఏడు ఏనుగులు, అంతకుముందు వారంరోజుల క్రితం నాగాలాండ్‌లో వోఖా జిల్లాలో రెండు ఏనుగులు మరణించిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆసియాలో ఏనుగుల సంతతి ఎక్కువగా ఉన్న మనదేశంలో, ఇటీవల కాలంలో అనేక మానవకల్పిత ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల చాలా ఏనుగులు దుర్మరణం పాలవుతున్నాయి. ఇలాంటి వన్యజీవుల వధ ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాల్లో కొనసాగుతోంది. 

కాలుష్యం, అడవుల విధ్వంసం, వాతావరణ మార్పు తదితర మా నవ కల్పిత అంశాల ప్రభావం పెరుగుతున్న కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో (1970-2014 మధ్యకాలం) 60 శాతం దాకా గ్లోబల్ వన్యప్రాణులు అంతరించిపోయాయని వరల్డ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూబ్ల్యూఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2018 వెల్లడించింది. భూగోళ స్వస్థతపై సైన్స్ ఆధారిత అం చనా ఇది. 4 వేలకు పైగా క్షీరదాలు, పక్షలు, చేపలు, సరీసృపాలు తదితర జీవజాలం అంతరించినట్లు ఆ అధ్యయనం తెలిపింది. మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా పెట్టుబడిదారీ పారిశ్రామిక విధానం ఫలితంగా భూగోళంలో ఏర్పడిన తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ జీవజాతులు అంతరించడం ఒక చారిత్రక ‘మానవీకరణ’ విషాదం. పర్యవసానంగా మనిషి మనుగడ సైతం ప్రశ్నా ర్థకంగా మారే వాతావరణ పరిస్థితలు నెలకొన్నాయని ఈ జీవుల అంతర్ధాన విషాద గాథ మానవాళిని కచ్చితంగా హెచ్చరిస్తోంది. 

భూతాపం 1.5 డిగ్రీల సెల్సిసియస్‌కు పెరిగితే భూగోళంపై అనూహ్యమైన వాతావరణ మార్పు లు చోటు చేసుకుంటాయని, అదే జరిగితే మనిషి సహా మొత్తం జీవజాలం అంతరించిపోయే ప్రమా దం ఉందని ఇటీవల ఐక్యరాజ్య సమితి వాతావరణ నివేదిక తీవ్రంగా హెచ్చరించింది. ఆ నివేదిక ప్రకారం పాస్టిక్ వ్యర్థాలు 1960లలో ప్లాస్టిక్ వ్యర్థాలు 5 శాతం సముద్రపక్షుల కడుపుల్లో ఉన్నట్లు కనుగొంటే, నేడు అది 90 శాతం పక్షుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశాబ్దాల కాలంలో లోతు తక్కువ నీళ్లలోని పగడపు దిబ్బలు సగానికిపైగా అంతరించిపోయాయి. లాటిన్ అమెరికా, కరేబియన్ ఉష్టమండల ప్రాంతాల్లో జంతుజాలం గణనీయమైన స్థాయిలో నాశనమై పోయాయి. ఆ ప్రాంతాల్లో 1970 నుంచి ఇప్పటిదాకా దాదాపు 89శాతం జంతువులు అంతరించిపోయినట్లు అంచనా. అదే సమ యలో కప్పలు, నదుల్లోని మత్య్ససంపద తదితర మంచి నీటి ఆధారిత జీవులు 83 శాతం క్షీణిం చాయి. ఈ నేపథ్యంలో ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందం తరహాలో ప్రకృతిపై మానవ ప్రభా వాన్ని తగ్గించడం, వన్య ప్రాణి సంరక్షణ అంశాల కేంద్రంగా ఒక అంతర్జాతీయ ఒప్పందం జరగాలని డబ్ల్యూబ్ల్యూఎఫ్ పిలుపు నిచ్చింది. 

పర్యావరణవేత్తలు తరచూ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ జాతీయ ప్రభుత్వాలు, ఎన్జీలు, మీడియా నిర్లక్ష్యం వహించడం లేదా నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికలేవీ అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆ నివేదిక విమర్శించింది. మానవ కార్యకలాపాల కారణంగా ఈదశాబ్దాంతానికి గ్లోబల్ వన్యజీవులు 67 శాతానికిపైగా అంతరించిపోతాయని 2016 డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక పేర్కొంది. జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ సేవలపై ఏర్పాటైన 2018 ఇంటర్ గవర్నమెంటల్  సైన్స్-పాలసీ ప్లాట్‌ఫారం సం స్థ నివేదిక, 2017 ఐక్యరాజ్య సమితి వాతావరణంపై వార్షిక నివేదిక ఇదే విషయాన్ని ధ్రువీకరిం చాయి. కార్పొరేట్ విధానాల కారణంగా మానవ కల్పిత విధ్వంసం జరుగుతున్న వేగంతో పోలిస్తే ప్రకృతి విధ్వంసాన్ని నివారించే చర్యలు అంత్యంత మందకొడిగా సాగుతుండడం దారుణం. నేడు మానవళిని వేధిస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే తీవ్ర స్థాయిలో ‘పర్యావరణ నాణ్యత కొరత’ (ఎకలాజికల్ క్రెడిట్ క్రంచ్) అత్యంత ఘోరమైన స్థితికి చేరుకుంటోంది. కార్పొరేట్ వాణజ్య ప్రయోజ నాలే పరమావధిగా కొనసాగుతున్న ప్రభుత్వాలు పునరుద్ధరణకు వీలులేని ప్రకృతి వనరులను పూర్తి గా ఖర్చు చేయడం, పర్యావరణ విధ్వంసకార ఉత్పత్తి పద్ధతులను, శిలాజ ఇంధన అతి వినియోగ విధానాలను విడనాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పులులు, పండాలు, తిమింగలాలు వంటి అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మాత్రమే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం పరిమితం కారాదు. అంతకు మించిన విస్తృత పరిధిలో మొత్తం పర్యావరణ వైవిధ్యతనంతా పునరు ద్ధరించే సంకల్పంతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవలసిన చారిత్రక సంద ర్భమిది. వాతావరణ అస్థిరత;  కాలుష్యంతో ధ్వంసంమైన సముద్రాలు, నదులు; క్షీణించిన భూమి, అటవీ ప్రాంతాలు; జీవవైవిధ్య విధ్వంసం తదితర మానవ మునుగడకు షరతుగా ఉన్న పర్యావరణ మంతా అంతరించిపోయిన తర్వాత ఈ భూగోళం ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, సుసంపన్నమైన గ్రహంగా మానవులకు ఆవాసయోగ్యం కాకుండా పోతుంది. 

అభివృద్ధి పేరుతో ప్రకృతి ఏర్పాటు/నిర్వహన క్రమాన్ని కార్పొరేట్ అత్యాశ ధ్వంసం చేస్తోంది. రాజస్థాన్‌లో వాణిజ్య, అభివృద్ధి అవసరాల కోసం ఆరావళి పర్వత శ్రేణుల్లోని కొండలను. అనుబం ధిత పర్యావరణాన్ని మాయం చేయడంపై ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి, నిషేధం విధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ వేత్తలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు హెచ్చరిస్తున్నప్పటికీ అనేక కొండలు, గుట్టలు వాణిజ్య దాహానికి, అందుకు సహకరించే ప్రభుత్వ విధానాల కారణంగా పూర్తిగా ధ్వంసమవడంతో పర్యవసానంగా ఆ ప్రాంతాల్లో అనేక పర్యావరణ సమస్యలు తలెత్తాయి. దేశ పురోగతి ప్రకృతి ఒనరుల పునాదిపై ఆధారపడి అం చనా వేయాలని పలువురు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ ప్రకృతి వనరులు అందిస్తున్న సేవ లపై ఒక సమగ్ర మూలాంకనం జరుపడం తక్షణావసరంగా ముందుకొచ్చింది. ‘నా తర్వాత ప్రళయం రానీ...’ అనే దృక్పథంతో శిలాజ ఇంధనాలను, సహజ వనరులను, జీవ వైవిధ్యాన్ని విపరీతంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వంటి వాతావరణ మార్పు నిరాకర్తలు (క్లైమేట్ చేంజ్ డినైర్స్) ప్రపంచ వ్యాప్తంగా అధికారంలోకి రావడంతో పారిస్ వాతావరణ ఒప్పందం వంటి కనీస ఉమ్మడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కూడా అమలులోకి రాలేకపోయింది. నేడు ప్రపంచ ‘మహా సంక్షోభం’లో (ఎపోకల్ క్రైసిస్=ఆర్థిక+పర్యావరణ సంక్షోభాలు) మానవాళి పీకలదాకా కూరు కపోయింది. దేశంలో పర్యావరణ విధ్వంసక ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ విధ్వంసక కార్పొరేట్ శక్తుల ఎజెండాతో నడుస్తున్న ప్రభుత్వాలు, పాలకులకు వ్యతిరేకంగా, మహా సంక్షోభాన్ని నిలువరించే/ పరి ష్కరించే ఒక గ్లోబల్ ప్రజా ఉద్యమం రావలసిన చారిత్రక సందర్భమిది.

English Title
Wildlife
Related News