బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీ యాత్రలు

Updated By ManamThu, 11/08/2018 - 23:03
bjp
  • బీజేపీ శబరిమల సంరక్షణ యాత్ర

  • రథయాత్రకు యడ్యూరప్ప శ్రీకారం

  • 13న ఎరువేులిలో యాత్ర ముగింపు

  • వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ యాత్రలు

  • 15న పట్టనంతిట్ట వద్దకు నాయకులు

congressకాసరగోడ్: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించేందుకు కేరళలో బీజేపీ రథయాత్ర ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా కాసరగోడ్, అళప్పుళ, తిరువనంతపురం, తోడుపుళ, పాలక్కాడ్ ప్రాంతాలలో యాత్రలు నిర్వహిస్తోంది. శబరిమల సంరక్షణ యాత్ర పేరుతో బీజేపీ రథయాత్రను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ప్రారంభించారు. కొండమీద ఉద్రిక్తతలను చల్లార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం బుర్ర ఉపయోగించాలని ఆయన అన్నారు. శబరిమలలో గొడవలకు తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. తాము సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం కాదని, కానీ ప్రజల సెంటిమెంట్ల ను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నా రు. ప్రస్తుత వివాదానికి పాలక ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కారణమని మండిపడ్డారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై, భారత్ ధర్మ జనసేన అద్యక్షుడు తుషార్ వెల్లపల్లి తదితరులు సంయుక్తంగా నిర్వహిస్తున్న రథయాత్రున ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర ఈనెల 13న శబరిమల సమీపంలోని ఎరువేులిలో ముగుస్తుంది. ఆరోజే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు విచారణకు వస్తాయి. మరోవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. సుధాకరన్ కాసర్‌గోడ్ నుంచి గురువారం సాయంత్రం ర్యాలీ ప్రారంభించారు. పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎం హసన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. వేర్వేరు ప్రాంతాల్లో అక్కడి నాయకులు కూడా ర్యాలీలు మొదలుపెడుతున్నారు. ఇవన్నీ కలిసి ఈనెల 15న పట్టనంతిట్టకు చేరుకుంటాయి. ఈ యాత్ర సమయంలో సీపీఎం, బీజేపీ కలిసి శబరిమల అంశాన్ని ఎలా రాజకీయం చేశారో వివరిస్తారని కేసీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ చెప్పారు.

English Title
BJP-Congress competitive tours
Related News