Home » కాంగ్రెస్ లో YSRTP విలీనం..? షర్మిల కీలక ప్రకటన

కాంగ్రెస్ లో YSRTP విలీనం..? షర్మిల కీలక ప్రకటన

by Bunty
Ad

 

కాంగ్రెస్ లో YSRTP విలీనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై వైఎస్‌ షర్మిల స్పందించారు. కాంగ్రెస్ లో YSRTP విలీనం కాదని పేర్కొన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలని.. విలీనం చేయాలని అనుకుంటే రెండేళ్లుగా కిందపడి మీదపడి పార్టీని ఎందుకు నడపాలన్నారు.

Advertisement

విలీనం చేయాలని అలోచన ఉంటే 3800కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేయాలని.. విలీనం చేయాలని అనుకుంటే పార్టీ పెట్టకముందే నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నాయని తెలిపారు షర్మిల. అవన్నీ కాదని వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదు… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒక ఫోర్స్ లా తయారయ్యిందని వివరించారు. తెలంగాణాలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు.. ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ 44సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలిందని వెల్లడించారు.

Advertisement

ఇది నేను చేసిన సర్వే కాదు… నాకు సంబంధం లేదు… 44సీట్లలో నా ప్రభావం ఉంటే.. 5 సీట్లకో…10సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం నాకు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు లీడర్ షిప్ ఉన్నా… దాన్ని నిలుపుకొనే సత్తా తెలంగాణ రాష్ట్రంలో లేదు.. కర్నాటక కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసే వాళ్లు ఉన్నారని వివరించారు. కర్నాటకలో డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారు… అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందని వివరించారు. వైఎస్సార్ ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నాడు.. వైఎస్సార్ లా కష్టపడ్డాడు కాబట్టి… కర్నాటక లో అధికారంలో వచ్చాడని వెల్లడించారు షర్మిల.

 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

Visitors Are Also Reading