Home » Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది

Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది

by Bunty
Ad

‘ది కేరళ స్టోరీ’ సినిమా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆదాశర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే. లవ్ జిహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ రాజకీయంగా సెగలు రేకెత్తిస్తోంది. ది కేరళ స్టోరీకి భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు తెలిపితే… విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రం తీవ్రవిమర్శలు చేస్తున్నారు.

Advertisement

భద్రతపరమైన అసలు కారణాలతో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ సినిమాను బ్యాన్ చేశాయి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం ఈ సినిమాకి పన్ను మినహాయింపు ప్రకటించాయి. వివాదాల సంగతి పక్కన పెడితే ది కేరళ స్టోరీ భారీ వసూళ్లను సాధిస్తోంది. అయితే ఈ సినిమా దర్శకుడు సుదీప్తోసేన్ ఈ సినిమాలో ఒక ప్రదాన పాత్రలో నటించిన ఆదాశర్మ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు అనే వార్త హైలైట్ గా మారింది.

Advertisement

ముంబైలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి వెళుతుండగా వీరి కారు యాక్సిడెంట్ కి గురైందని, ఈ ప్రమాదంలో సుదీప్తోసేన్ అదేవిధంగా ఆదాశర్మకు కూడా గాయాలయ్యాయి అని తెలుస్తోంది. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీం హాజరు కావాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నామని యూత్ గ్యాదరింగ్ ముందు నుంచి నడిపించలేకపోతున్నామ ని డైరెక్టర్ సుదీప్తోసేన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Visitors Are Also Reading