Home » రజినీకాంత్ జైలర్ మూవీకి ఆ సెంటిమెంట్ కలిసొచ్చేనా ?

రజినీకాంత్ జైలర్ మూవీకి ఆ సెంటిమెంట్ కలిసొచ్చేనా ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్క నటుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా హిట్ అయితే.. ఇక అదే తరహాలోనే సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు. అలా సెంటిమెంట్ ఫాలో అయ్యేవారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముందుంటారు. తాజాగా తలైవా నటించిన జైలర్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తలైవా తన సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు.

Advertisement

రజినీకాంత్ తన సినిమాల విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లేవారు. అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఎప్పటి మాదిరిగానే ఈ మూవీ రిలీజ్ కి ముందే హిమాలయాలకు వెళ్లినట్టు సమాచారం.అయితే ఆ మధ్య అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా హిమాలయాలకు వెళ్లలేదు సూపర్ స్టార్. అయితే ఆ సినిమాలు అన్నీ అంతగా కలిసిరాలేదు. దీంతో జైలర్ మూవీ విడుదల కానుండటంతో  రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో కూడా చాలా సినిమాలకు తలైవా ఇలాగే సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Advertisement

చెన్నై, బెంగళూరు నగరాల్లో రజినీకాంత్ మూవీ విడుదల నేపథ్యంలో ఏకంగా కొన్ని కంపెనీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఆయనకు ఉన్నక్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు నటుడు సునిల్, తమిళ నటుడు యోగిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విడుదలైన ప్రీమియర్ షో ల ద్వారా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్టు సమాచారం. రజినీకాంత్ సెంటిమెంట్ వర్కవుట్ అయితే మాత్రం తన ఖాతాలో మరో హిట్ చేరినట్టే అని తెలుస్తోంది. ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 చంద్రముఖి చిత్రంలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

డైరెక్టర్ మెహర్ రమేష్ వివాదస్పద వ్యాఖ్యలు.. ట్రోలర్స్ ఏమన్నారో తెలుసా ?

 భోళా శంకర్ మూవీకి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్!

Visitors Are Also Reading