Home » చంద్రముఖి చిత్రంలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

చంద్రముఖి చిత్రంలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

by Mounika
Ad

రజనీకాంత్‌ కెరీర్‌లో సూపర్ హిట్ సక్సెస్ ని  అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి మూవీ కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తుంది. అంతలా చంద్రముఖి మూవీ ప్రేక్షకాదరణ పొందింది. 2005లో పి. వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్‌, జ్యోతిక,  వినీత్, నయనతార, ప్రభు, నాజర్‌, వడివేలు వంటివారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో చంద్రముఖిగా జ్యోతిక యాక్షన్ వేరే లెవల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.   త్వరలోనే చంద్రముఖి  సీక్వెల్‌ కూడా రిలీజ్‌ కు సిద్ధమవుతోంది.

Advertisement

 ఇకపోతే ఈ చిత్రంలో ప్రతి పాట కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. అందులో అత్తింధోం.. పాట చాలా ఫేమస్‌ అయ్యింది. ఇక ఈ పాటలో కనిపించే చిన్నారి అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ముద్దుగా బొద్దుగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే  ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్‌. బాలనటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్‌ చేసిన ఆమె తర్వాతకాలంలో ఎక్కువగా వెండితెరపై కనిపించనేలేదు. రాఘవ లారెన్స్ హీరోగా రాబోతున్న చంద్రముఖి 2 రిలీజ్‌కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ చిన్నారి ఎలా ఉందోనని కొందరు నెట్టింట సెర్చ్‌ చేయటం మొదలుపెట్టారు.

Advertisement

 

ప్రహర్షిత 2021లో పెళ్లి తీసుకొని వివాహ జీవితంలో అడిగి పెట్టింది.  గతేడాది ఈమెకు ఒక పాప పుట్టింది. 18 సంవత్సరాలగా  సినిమాలకు, సీరియల్స్ కు  దూరంగా ఉన్న ప్రహర్షిత తమిళంలో ఓ కొత్త సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సోషల్‌ మీడియాలో ఫోటోషూట్లు, కూతురితో ఆడుకున్న వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులను దగ్గరవుతుంది. తాజాగా ప్రహర్షిత  చంద్రముఖి సినిమాలో చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా మారిపోయిందో తెలియజేస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వేరే లెవల్‌ అని నెటిజన్లు కామెంట్స్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CvpWvneJrtw/?igshid=NTc4MTIwNjQ2YQ==

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మహేష్ బాబు ఏ ఇతర హీరో సినిమా ఈవెంట్స్ కి ఎందుకు వెళ్ళరో తెలుసా…?

డైరెక్టర్ మెహర్ రమేష్ వివాదస్పద వ్యాఖ్యలు.. ట్రోలర్స్ ఏమన్నారో తెలుసా ?

బాహుబలిలో నటించడానికి రమ్యకృష్ణ అన్ని షరతులు పెట్టారా? వీటికి రాజమౌళి ఓకే చెప్పారా?

 

Visitors Are Also Reading