Home » జపాన్ లో మనుషులు ఎందుకు అంత సన్నగా ఉంటారో తెలుసా? అసలు కారణం ఇదే!

జపాన్ లో మనుషులు ఎందుకు అంత సన్నగా ఉంటారో తెలుసా? అసలు కారణం ఇదే!

by Srilakshmi Bharathi
Ad

దాదాపు చాలా దేశాలలో ముఖ్యంగా ఇండియాలో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంది. కానీ, జపాన్ లో మాత్రం కేవలం 4 శాతం మాత్రమే ఊబకాయం ఉంది. ఎందుకు జపాన్ లో ఊబకాయం తక్కువగా ఉంది? ఎందుకు అక్కడి ప్రజలు సన్నగా ఉంటారో తెలుసా? అసలు వాళ్ళు ఏమి తింటారు అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.

1. ఆహరం:

Advertisement

జపాన్ లో వారు అంత సన్నగా ఉండడానికి ముఖ్య కారణం వారు తీసుకునే ఆహరం. వారు తక్కువ సాచురేటెడ్ ఫాట్ ఉండి, ఎక్కువ కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. వీరి ఆహారంలో ఎక్కువ కూరగాయలు, సి ఫుడ్స్ ఉండేలా చూసుకుంటారు. వీరు తీసుకునే ఆహరం మాంసాహారం తక్కువ ఉంటుంది. ప్రోటీన్ కోసం వీరు చేపలపై ఆధారపడతారు.

japanese

2. నో స్నాక్స్:
వీరు స్నాక్స్ అస్సలు ప్రిఫర్ చెయ్యరు. కిట్ క్యాట్ లాంటి చాకోలెట్స్ కి దూరంగా ఉంటారు. బర్గర్ వంటి స్నాక్స్ కూడా వీరు అస్సలు తీసుకోరు. చాలా తక్కువ మోతాదులో స్నాక్స్ తింటారు.

3. ఫాస్ట్ ఫుడ్:
జపాన్ లో ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా హెల్దీగా ఇంట్లో చేసుకున్నట్లే ఉంటుంది. ఇక్కడ కూడా KFC , మెక్ డొనాల్డ్స్ లాంటివి ఉంటాయి.

Advertisement

japanese

4. పోర్షన్ సైజ్:
వీరు ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోరు. చాలా కొద్దీ ఆహారాన్ని చిన్న చిన్న ప్లేట్స్ లలోకి తీసుకుని తింటూ ఉంటారు. వారు చిన్న చిన్న ప్లేట్స్ లోకే ఆహారాన్ని సర్వ్ చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు.

5. ఆస్వాదిస్తూ తింటారు:
వారు తీసుకునే ఆహారం చాలా కొద్దీ మొత్తమే అయినా, దానిని ఆస్వాదిస్తూ తినడం వలన ఒంటబడుతుంది. పదే పదే ఆకలి వెయ్యకుండా ఉంటుంది. తినేటప్పుడు ఫుడ్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఒక చోట కూర్చుని ప్రశాంతంగా తింటారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !

బాబు బాగా బిజీ మూవీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఫోన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు పెట్టారు ? దీని ఉపయోగం ఏంటి ?

Visitors Are Also Reading