Home » కైకాల సత్యనారాయణపై పోసాని అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు..? నెటిజన్ల ఆగ్రహానికి కారణం అదేనా ?

కైకాల సత్యనారాయణపై పోసాని అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు..? నెటిజన్ల ఆగ్రహానికి కారణం అదేనా ?

by Anji
Ad

తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన వారిలో కైకాల సత్యనారాయణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించినటువంటి కైకాల సత్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. డిసెంబర్ 23న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కైకాల మృతి చెందాడనే విషయం తెలుసుకున్న తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారమే.. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను జరిపించారు. కైకాల సత్యనారాయణ మృతికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ సంతాపాన్ని ప్రకటిస్తూ.. చేసిన కామెంట్స్ ఇప్పుడూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

Advertisement

ఓవైపు కైకాలను ప్రశంసిస్తూనే.. మరోవైపు రాజకీయ ఉద్దేశం ఉన్నట్టుగా కొన్ని సంచలన కామెంట్లు చేశారు పోసాని కృష్ణమురళి. ముఖ్యంగా “చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయతీగా బతికిన వాడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంత కాలం  కాకపోయినా సినీ కళాకారులు ఉన్నంత కాలం బతికి ఉండే నటుడు కైకాల”.. అంటూ  జోహార్  తెలిపారు.పోసాని చేసిన ఈ వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కైకాల మృతిపై పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా ఏదో అటెన్షన్ చేసినట్టు ఉన్నాయంటూ కొందరూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరూ ఈ సమయంలో కూడా చెంచాగిరి, డ్రామాలు అంటూ పొలిటికల్ ప్రెస్ మీట్స్ లో వాడే పదాలు ఎందుకు వాడుతున్నావంటూ పోసానిని తిడుతున్నారు. 

Advertisement

Also Read :  Chalapathi rao: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..! మరణానానికి కారణం ఇదేనా ?

Manam News

మరోవైపు పోసాని ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేయంతో పవన్ అభిమానులు పోసాని ఇంటిపై దాడులు కూడా చేసిన విషయం విధితమే.పోసానికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కొర్పొరేషన్ చైర్మన్ గా పోసానికి పదవీ దక్కిన విషయం తెలిసిందే. కైకాల సత్యనాయణ మృతిపై  ఇలా రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 30 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆపరేషన్ దుర్యోధన లాంటి ఎమోషన్ సినిమాను తెరకెక్కించి అభిమానులను సంపాదించుకున్నారు పోసాని. అదివిధంగా నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై తిరుగులేని నటుడిగా రాణించారు కైకాల సత్యనారాయణ. ప్రధానంగా తెలుగు సినిమాలలో కైకాల చేయని క్యారెక్టర్ లేదనే చెప్పవచ్చు. దాదాపు 6 దశాబ్దాల పాటు సినిమాల్లోనే జీవితం సినీ పరిశ్రమకు ఆయన అందించిన విజయాలు మరుపురానివి.

Also Read :  భ‌ర్త చ‌నిపోయిన విష‌యాన్ని జ‌య‌సుధ వ‌ద్ద ఎందుకు దాచారు..? తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!

Visitors Are Also Reading