Home » Chalapathi rao: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..! మరణానానికి కారణం ఇదేనా ?

Chalapathi rao: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..! మరణానానికి కారణం ఇదేనా ?

by Sravanthi Pandrala Pandrala
Ad

Chalapathi rao Passes Away: 2022లో టాలీవుడ్ లో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటికి ఎంతో మంది సీనియర్ నటులు ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా కైకాల సత్యనారాయణ మృతిని మరువకముందే , మరో సీనియర్ యాక్టర్ చలపతిరావు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగింది. చలపతిరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారట.

Advertisement

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు. శనివారం అర్ధరాత్రి మృతిచెందినట్టు తెలుస్తోంది. 1944 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు. ఆయన ఇండస్ట్రీలో దాదాపుగా 1200 కు పైగా చిత్రాల్లో నటించారని చెప్పవచ్చు. చలపతిరావుకు ఓ కుమారుడు ఇద్దరు కుమార్తెలు. ఇండస్ట్రీలో చలపతిరావు అందరితో చాలా ఆప్యాయంగా ఉండేవారు.

Advertisement

చాలామంది నటీనటులు చలపతిరావును బాబాయి అని పిలుస్తూ ఉంటారు. చలపతిరావు మొదటిసారి నటించిన చిత్రం గూడచారి 116. చివరిసారి నటించిన చిత్రం ఓ మనిషి నీవెవరు.. ఎన్నో గొప్ప సినిమాల్లో గొప్ప పాత్రలు చేసిన చలపతిరావు ఇలా ఇండస్ట్రీకి దూరమవడం అందరినీ కలవరపెడుతోంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులంతా విచారం వ్యక్తం చేస్తూ ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఇంటికి చేరుకుంటున్నారు. గొప్ప నటుడు మరణించడం బాధాకరం ఆయన ఆత్మ శాంతించాలని మనం కూడా కోరుకుందాం.

also read:

Visitors Are Also Reading