Home » తిరుమల శ్రీవారిని “గోవిందా” అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

తిరుమల శ్రీవారిని “గోవిందా” అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

by Bunty
Ad

తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే భక్తులకు ఎంతో ఇష్టం. భక్తులు వెంకటేశ్వర స్వామిని ఎంతో ఇష్టంగా ఆరాధిస్తారు. ఇతని దర్శనం కోసం ఒక్కొక్కరు వేయికళ్ళతో ఎదురు చూస్తుంటారు. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని గోవిందా అనే పేరుతో కూడా పిలుస్తారు. గోవిందా అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. అలా పిలవడానికి గల కారణం.. దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్లి…నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా! నాకు ఒక గోవు కావాలి అని అడుగుతాడు. దానికి ఆగస్త్యుడు సమాధానంగా స్వామి నేను నీకు గోవుని ఇస్తాను. కానీ వేదాంతం ప్రకారం పద్మిని లేనిదే గోవును దానం చేయకూడదు. కావున మీరు సతీసమేతంగా వస్తే గోదానం చేస్తాను అని చెప్పడంతో శ్రీనివాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆశ్రమంలో ఆగస్త్యుడు లేని సమయంలో శ్రీనివాసుడు పద్మావతిని తీసుకొని వెళ్లి… అక్కడ ఉన్న శిష్యులతో నన్ను మీ గురువుగారు రమ్మన్నారు.

Advertisement

సతిసమేతంగా వస్తే గోదానం చేస్తానని చెప్పాడు అని అన్నాడు. దానికి శిష్యులు మా గురువుగారు లేనిదే గోవుని దానం చేయలేము అని చెప్పారు. మీరు ఆయన ఉన్నప్పుడే రండి అని చెబుతారు. ఆ మాట విన్న శ్రీనివాసుడు కోపంతో తిరుమల కొండ వైపుకి తిరిగి వెళ్ళిపోతాడు. ఆగస్త్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత తన శిష్యులు జరిగిన విషయాన్ని ఆగస్త్యునితో చెబుతారు. దాంతో ఆగస్త్యుడు గోవును తీసుకొని శ్రీనివాసుని వద్దకు వెళతాడు. కొండవైపుకు వెళ్తున్న స్వామిని చూసి పిలుస్తాడు. కోపంతో శ్రీనివాసులు పట్టించుకోడు. దీంతో ఆగస్త్యుడు గోవఇందా అని అంటాడు. అంటే దానికి అర్థం గోవు ఇదిగో అని అర్థం. గోవఇందా గోవఇందా అని పిలిచాడు. ఆ పేరు కాస్త గోవిందాగా మారింది.

ఇవి కూడా చదవండి

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

Visitors Are Also Reading