Home » “BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

by Bunty
Ad

పవన్‌ కళ్యాణ్, సాయిధరమ్‌ తేజ కాంబోలో వచ్చిన బ్రో సినిమా శుక్రవారం రిలీజ్‌ అయి.. మంచి కలెక్షన్లను తెచ్చుకుంటోంది. వినోదమే సితం సినిమాకు రీమేక్‌ గా ఈ సినిమా తెరకెక్కగా.. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు, సముద్ర ఖని దర్శకత్వం వహించారు. అయితే.. బ్రో సినిమా ఇప్పుడు ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చుట్టుకుంది. సంక్రాంతి పండగ సందర్భంలో అంబటి డ్యాన్స్‌ చేసిన వీడియోను తీసుకుని.. బ్రో సినిమాలో అతని పాత్రను పెట్టినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంబటి రాంబాబు పేరుకు బదులు శ్యామ్‌ బాబు పాత్రను క్రియేట్ చేశారట.

Advertisement

ఈ శ్యామ్‌ బాబు పాత్రను పృథ్వీ నటించారట. అంబటి లాగే.. శ్యామ్‌ బాబు కూడా పవన్‌ కళ్యాణ్‌ ఇరిటేట్‌ చేస్తారని ఈ సినిమాలో చూపించారని సమాచారం. దీంతో ఇప్పుడు అంబటి రాంబాబు.. బ్రో సినిమా లో ఉన్నాడని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఇక దీనిపై స్వయంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్ చేసిన అంబటి రాంబాబు.. బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నానని చెప్పారు. బ్రో సినిమా చూడలేదని… నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు అని ఫైర్‌ అయ్యారు.

Advertisement

ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ… నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడని పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయనన్నారు. పవన్ కళ్యాణ్ ది శునకానందం… సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం అంటూ చెప్పుకొచ్చారు అంబటి. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆనందం ఇది అని చురకలు అంటించారు. నా డ్యాన్స్ సింక్ అవలేదట… నేను ఏమైనా డ్యాన్స్ మాస్టర్ నా? పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సింక్ అవడంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.

ఇవి కూడా చదవండి

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

Visitors Are Also Reading