Home » తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ పరీక్ష‌ ఫ‌లితాలు ఎప్పుడంటే..?

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ పరీక్ష‌ ఫ‌లితాలు ఎప్పుడంటే..?

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణలో కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు ఇంటర్ మీడియట్ తరగతులు తొలుత అనుకున్న ప్రకారం ప్రారంభం కాలేదు. ఇక ఈ సారి అనుకున్న సమయానికే తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 24న పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. మరొకవైపు ఈ నెల 12 నుంచి వాల్యుయేషన్ సైతం ప్రారంభించింది. గతంలో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది ఇంటర్మీడియట్ బోర్డు.


కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదు కావడంతో విద్యార్థులతో పాటు వివిధ వర్గాల నుంచి తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడడంతో స్పందించిన ప్రభుత్వం ఫెయిల్ అయిన వారందరినీ మినిమం మార్కులతో పాస్ చేసింది. ఈసారి మరలా అలా పాక్ చేసే పరిస్థితి ఉండదని ముందస్తుగానే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా విద్య విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ప్రతి దశను ఉన్నతాధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాలలో ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ నిర్వహిస్తోంది. ఇంటర్ ఫలితాలను త్వ‌ర‌గా అందించేందుకు బోర్డు పనిచేస్తోంది. జూన్ 22న ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

Advertisement

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ షెడ్యూల్ని సైతం ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. మొత్తం 221 వర్కింగ్ డేస్ తో కూడిన జున్ను ఇంటర్ బోర్డు ఇటీవలే విడుదల చేసింది. జూలై 1న ఇంటర్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభించనున్నట్టు రోడ్డు వెల్లడించింది. సెకండియర్ క్లాసులను జూన్ 15న ప్రారంభించనున్నట్టు మీడియట్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 9 లోపు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయి. 2023 జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు. వచ్చే ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్లో వెల్లడించింది.

Also Read : 

సూపర్ స్టార్ కృష్ణను హీరోగా పనికిరాడు అన్నారు.. ఎందుకంటే..?

గుజరాత్ vs రాజస్థాన్… బీజేపీ vs కాంగ్రెస్..!

 

Visitors Are Also Reading