సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ లో ఉండేది. సినిమాలో భాగంగానే ఆయనను ఏం అన్నా కూడా అభిమానులు ఊరుకునే వారు కాదు. ఆ ఆసినిమాలో అన్నా వారికీ.. అలాగే దర్శకునికి అప్పట్లోనే లెటర్స్ రాసేవారు. అంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన. ఎవరికీ సాధ్యం కానీ విధంగా హీరోగా 300 వందలకు పైగా సినిమాలు తీశారు. అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా ఎవరైనా చేయడానికి భయపడిన కొత్త కొత్త సినిమా కథలను ఎంచుకొని అభిమానులకు అందించారు.
Advertisement
అందుకే తెలుగులో ప్రతి కొత్తధనానికి శ్రీకారం చుట్టింది కృష్ణగారే. అయితే ఆయనను కూడా హీరోగా పనికిరాడు అని చాలా మంది అన్నారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కృష్ణ తన సినిమా కెరియర్ లో పడిన కష్టాల గురించి వివరించాడు. తాను మొదట్లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాను అని చెప్పాడు. అయితే ఒక్కనొక సమయంలో కృష్ణకు వరుసగా 12 ప్లాప్స్ వచ్చాయి. దాంతో ఆయనను చాలా మంది దర్శక నిర్మాతలు పక్కన బెట్టారు.
Advertisement
ఇక కృష్ణ హీరోగా పనికిరాదు అంటూ కామెంట్స్ చేసారు. అప్పుడు ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో పడిన కృష్ణ.. తన తమ్ముడిని నిర్మాతగా చేస్తూ సొంత బ్యానర్ లో పాడి పంటలు అనే సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ కృష్ణగారిని మళ్ళీ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెన్నకి తిరిగి చూసుకోలేదు. అయితే ఇప్పుడు తన నట వారసునిగా పరిచయం చేసిన మహేష్ బాబు కూడా టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :