Home » గుజరాత్ vs రాజస్థాన్… బీజేపీ vs కాంగ్రెస్..!

గుజరాత్ vs రాజస్థాన్… బీజేపీ vs కాంగ్రెస్..!

by Azhar

ఐపీఎల్ 2022 సీజన్ రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ముగిసిపోనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లోనే నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇందులో గుజరాత్ మొదటి నుండి దూకుడుగా ఆడుతున్న క్వాలిఫైర్ 1 లో రాజస్థాన్ ను ఓడించి ఫైనల్స్ కు రాగ.. రాజస్థాన్ సైలెంట్ గా వచ్చేసింది.

అయితే ఈ ఫైనల్స్ మ్యాచ్ కు కొంత మాబ్ది రాజకీయాన్ని రుద్దుతున్నారు. ఇది గుజరాత్ vs రాజస్థాన్ మ్యాచ్ కాదని.. ఇది బీజేపీ vs కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లు రెండు రాష్ట్రాలను సూచిస్తున్నాయి. అందులో గుజరాత్ రాష్ట్రాన్ని బీజేపీ పాకిస్తుంటే.. రాజస్థాన్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవే రెండు పార్టీలు ఇప్పుడు సెంట్రల్ లో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

 

దాంతో ఈ మ్యాచ్ బీజేపీ vs కాంగ్రెస్ మ్యాచ్ అంటున్నారు. ఇక కొంత మంది బీజేపీ రాష్ట్రాన్ని సూచిస్తుంది కాబట్టి మేము ఆ జట్టును సపోర్ట్ చేస్తున్నం అంటే మరి కొందరు కాంగ్రెస్ రాష్ట్రాన్ని సూచించే రాజస్థాన్ జట్టుకు మద్దతు ఇస్తున్నాము. రేపు ఏ పార్టీ గెలుస్తుంది అనేది చూద్దాం అని అనుకుంటున్నారు. అయితే రేపు 8 గంటలకు ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసింది బీసీసీఐ. ఈ కార్యక్రమాలకు చాలా మంది సెలబ్రెటీలు రాబోతున్నట్లు తెలుస్తుంది.

Visitors Are Also Reading