Home » Chanakya Niti : జీవితంలో చెడు స‌మ‌యాలు రాకుండా ఏమి చేయాలంటే..?

Chanakya Niti : జీవితంలో చెడు స‌మ‌యాలు రాకుండా ఏమి చేయాలంటే..?

by Anji
Ad

ఆచార్య చాణక్యుని విధానాలు మ‌న జీవితానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. జీవితంలో విజయం సాధించాలన్నా, ధనవంతులు కావాలన్నా, కష్టాల నుంచి బయట పడాలన్నా, చాణక్యుడు చెప్పిన విధానాలు నేటికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మూర్ఖునితో జ్ఞానం గురించి మాట్లాడటం పెద్ద మూర్ఖ‌త్వం. ఇతరులను అర్థం చేసుకోలేని వారితో జ్ఞానం గురించి అస‌లు మాట్లాడకూడదు. తెలివి తక్కువ వారితో జ్ఞానం గురించి మాట్లాడితే మనం సమయాన్ని వృథా చేసుకున్న వార‌మే అవుతాము. ఎటువంటి కారణం లేకుండా చర్చలు పెరుగుతుంటాయి. ఎందుకంటే అలాంటి వారు ఎవరి మాట వినరు. అందుకే ఇలాంటి వ్యక్తులకు మ‌నం దూరంగా ఉండడం బెట‌ర్‌.

Advertisement

2. పేదరికం తొలగిపోయేందుకు దారిద్య్రం చుట్టు ముట్టకూడదనుకుంటే దానం చేయడం ఉత్తమ మార్గమ‌ని ఆచార్య చాణక్య చెప్పారు. తన శక్తి మేరకు ఎప్పటికప్పుడు దానం చేస్తూ ఉండాలి. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి పుణ్యాన్ని పొందుతాడు. పాపాలను కడిగేసుకున్న వారు అవుతారు.

Advertisement


3. వినయంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి తన చర్యల కారణంగా సుఖం లేదా దుఃఖాన్ని పొందుతాడు. భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలు ఎదురు కాకూడదని అనుకుంటే అహంకారంతో అస‌లు ప్రవర్తించకూడదు.

 

4. మనం ఎప్పుడు అందరితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి అప్పుడే. జ్ఞానం కలిగిన వ్యక్తి తన కుటుంబం లోనే కాకుండా బయట కూడా గౌరవాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి చాలా వేగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాడు.


5. భగవంతునిపై భక్తి భగవంతుని పట్ల మనకు ఉండే భక్తి శక్తిని ఇస్తుంది. ఆ సమయాల్లో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మనకు భగవంతుని పై విశ్వాసం, భక్తి రెండు ఉండాలి.భ‌క్తితో పాత జ‌న్మ‌ల దుష్క‌ర్మ‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు అని ఆచార్య వివ‌రించారు.

Also Read : 

ఇతరుల దగ్గర ఈ వస్తువులు అస్సలు తీసుకోకండి.. తీసుకున్నారో జీవితాంతం కష్టాలే..!!

Jersy : హిందీ జెర్సీపై నాని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..!

Visitors Are Also Reading