చాలా మందికి ఎదుటి వారి దగ్గర ఇతర వస్తువులు అడిగి తీసుకునే అలవాటు ఉంటుంది. ఓకే ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడం మంచిదే కానీ, ఈ వస్తువులు మాత్రం ఎదుటి వారి దగ్గర తీసుకుంటే మనం సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. శాస్త్రం ప్రకారం ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకుంటే దాని ప్రతికూల శక్తి మనలోకి వస్తుందట.. దీనివల్ల కొద్దిరోజుల తర్వాత అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటో చూద్దామా..?
దుస్తువులు : మనం ఎప్పుడైనా ఇతరుల దుస్తులు తీసుకోకూడదు. ఎందుకంటే వారి దుస్తులు ధరించినప్పుడు వారి యొక్క నెగటివ్ ఎనర్జీ తో పాటుగా వారి శరీరంలోని బ్యాక్టీరియాలు కూడా తీసుకున్న వారిలో చేరుతాయి .
వాచ్ : వాస్తు నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఎవరి దగ్గర నుంచి అయినా వాచ్ ను తీసుకోరాదు. ఎందుకంటే మానవ జీవితం సమయం తో ముడిపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి పై చెడు ప్రభావాన్ని కలిగి ఉండే సమయంలో అతని గడియారాన్ని తీసుకుంటే వారి చెడు సమయం మన జీవితంలోకి వస్తుంది.
పాదరక్షలు: వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పేదరికం ఉంది అంటే, శని స్థానం పాదలలో ఉందని అంటారు. అందుకే ఇతరుల పాదరక్షలు మనం తీసుకుంటే వారి శని మనకు వచ్చే అవకాశం ఉంటుంది.
ALSO READ :
మీకు రాత్రి నిద్ర పటట్లేదా.. అయితే ఇలా చేయండి..?
Chanakya Niti : మనిషిని విజయపథంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!