Home » Jersey : హిందీ జెర్సీపై నాని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..!

Jersey : హిందీ జెర్సీపై నాని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..!

by Anji
Published: Last Updated on
Ad

నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత ప్ర‌త్యేకంగా తెరకెక్కిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక ఈ సినిమాను హిందీలో లో షాహిద్ కపూర్ రీమెక్ చేస్తున్న విషయం తెలిసిన‌దే. హిందీలో కూడా ఈ చిత్రానికి గౌతమ్ తిన్న నూరీనే దర్శకత్వం వహించాడు.

Advertisement

కరోనా మ‌హ‌మ్మారి కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదల అయింది. తెలుగులో మంచి విజ‌యాన్ని అందుకున్న విధంగానే హిందీలో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.

 

తాజాగా ఈ సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించాడు ‘జెర్సీ ని చూసాను. గౌతం మరొక‌సారి మ్యాజిక్ రిపీట్ చేసాడు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటనతో మనసులను కొల్లగొట్టారు. పంకజ్ కపూర్ సర్, నా కొడుకు రోనిత్ కూడా అద్భుతంగా న‌టించాడు. నిజమైన సినిమా అంటే ఇది అని చెప్పుకొచ్చాడు నాని. ప్రస్తుతం నాని చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

 

Also Read : 

డిగ్రీ చదివి యూట్యూబ్ లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంది… కట్ చేస్తే లండన్ లో 40 లక్షల జాబ్….!

ఆర్ఆర్ఆర్ కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన 10 సినిమాలు ఇవే..!!

Visitors Are Also Reading