Home » కుక్క కాలు ఎత్తి మూత్రం పోయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏమిటో తెలుసా..?

కుక్క కాలు ఎత్తి మూత్రం పోయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

ముఖ్యంగా కుక్క‌ను అత్యంత విశ్వాసం క‌లిగిన జంతువుగా ప‌రిగ‌ణిస్తారు. మాన‌వునితో తొలిసారి స్నేహం చేసిన జంతువు కుక్క‌నే కాబ‌ట్టి చాలా వ‌ర‌కు కుక్క ఉన్న విశ్వాసం కూడా లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొంటుంటారు. అయితే అలాంటి కుక్క క‌రెంట్ స్థంభం ఈమీద‌, బండి చ‌క్రాల మీద‌, ఏదైనా పాతిన క‌ర్ర ఉంటే దాని మీద కాలు ఎత్తి మూత్రం పోస్తుంటుంది. ఇలా ఎందుకు చేస్తుంద‌నేది చాలా మందికి క్లారిటీ లేదు. దాని వెనుక మాత్రం ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. కార‌ణ‌మేమిటో ఒక‌సారి తెలుసుకుందాం.


కుక్కలు కాలు పైకి లేపి మూత్రం పొయ్య‌డం వెనుక పెద్ద కార‌ణం దాగి కొద్ది కొద్దిగా క‌రెంట్ స్థంబాలు, తుప్ప‌లు, చ‌క్రాల మీద‌, రాయి వంటి వాటి మీద మూత్రం కొద్ది మోతాదులో వ‌దిలి ముందుకెళ్తూ ఉంటాయి. అక్క‌డ కొంచెం పోసి మ‌రికొంత దూరం వెళ్లిన త‌రువాత మ‌ళ్లీ కొంచెం వ‌దులుతాయి. కేవ‌లం కుక్క‌లు మాత్ర‌మే కాదు తొడేళ్లు వంటి కొన్ని జంతువులు ఇదేవిధంగా చేస్తుంటాయి.

Advertisement

Also Read : IPL 2022 : ఆ న‌లుగురు ఆట‌గాళ్లు ఎంతో ప్ర‌త్యేకం.. ఎందుకో తెలుసా..?

Advertisement

ముఖ్యంగా కుక్క‌లు లేదా తొడేళ్లు అడ‌విలో ఆహార అన్వేష‌ణ కోసం గుంపులు గుంపులుగా వెళ్లుతుంటాయి. పెద్ద గుంపు చిన్న గుంపుగా త‌రువాత ఒక్కొక్క‌టి విడిపోతాయి. కుక్క‌ల‌కు వాస‌న శ‌క్తితో పాటు వినికిడి శ‌క్తి కూడా ఎక్కువ ఉండ‌డంతో చాలా ఈజీగా వాటికి ఆహారం దొరికిపోతుంటుంది. ఈ విధంగా ఆహారం వేట‌లో కొంత దూరం వెళ్తుంటాయి.

ఇలా వెళ్లే కుక్క‌లు, ఇత‌ర జంతువులు అవి మూత్రం పోయ‌డం అనేది ఒక సిగ్న‌ల్‌. త‌మ గుంపును క‌లుసుకోవ‌డానికి మూత్రం వ‌దిలి వెళ్లుతూ ఉంటాయి. ఇలా మూత్రం వ‌ద‌ల‌డంతో వేరే కుక్క‌ల‌కు ఒక క్లారిటీ వ‌స్తుంది. ఒక్కో కుక్క మూత్రం వాస‌న ఒక్కో విధంగా ఉంటుంది. అది కుక్క ప‌సిగ‌ట్టి ఆ మార్గంలో ఎన్ని కుక్క‌లు వెళ్లాయో తెలుసుకుంటుంటాయి. ఆ మూత్రం వాస‌న ద్వారా ఇత‌ర కుక్క‌ల‌కు మార్గం సులభంగా తెలుస్తుంది.

Also Read :  DJ TILLU TRAILER : డీజే టిల్లు ట్రైలర్ విడుదల…!

Visitors Are Also Reading