Telugu News » IPL 2022 : ఆ న‌లుగురు ఆట‌గాళ్లు ఎంతో ప్ర‌త్యేకం.. ఎందుకో తెలుసా..?

IPL 2022 : ఆ న‌లుగురు ఆట‌గాళ్లు ఎంతో ప్ర‌త్యేకం.. ఎందుకో తెలుసా..?

by Anji

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. ఈనెల 12, 13 తేదీల్లో నిర్వ‌హించే వేలంలో ఉన్న క్రికెట‌ర్ల‌కు సంబంధించిన తుది జాబితా ప్ర‌క‌టించింది. గ‌త నెల‌లో విడుద‌ల చేసిన జాబితాలో మొత్తం 1214 మంది క్రికెట‌ర్లు ఉండ‌గా.. ఫ్రాంచైజ్‌ల ఆస‌క్తి మేర‌కు మ‌రొక 44 మందిని చేర్చారు. ఆ జాబితాను 590 మందికి కుదించారు. ఇందులో 355 మంది అంత‌ర్జాతీయ ఆరంగ్రేటం చేయ‌ని క్రికెట‌ర్లు ఉన్నారు. ఇందులో 370 మంది భార‌తీయులుండ‌గా.. 220 మంది విదేశీ క్రికెట‌ర్లున్నారు.

Ads

మొత్తం 48 మంది క్రికెట‌ర్లు త‌మ క‌నీస ధ‌ర‌ను రూ.2కోట్లుగా నిర్ణ‌యించుకున్నారు. 20 మంది ఆట‌గాళ్లు త‌మ క‌నీస ధ‌ర‌ను 1.5 కోట్లు నిర్ణ‌యించుకున్నారు. అదేవిధంగా 34 మంది రూ.కోటి పెట్టుకుని వేలానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అండ‌ర్‌-19 స్టార్టు య‌శ్‌దూల్‌, వికి ఒస్త్వాల్‌, ర‌వీంద్ర‌న్ హంగార్గ్ క‌ర్‌తో పాటు యువ ఆట‌గాళ్లు షారుఖ్‌ఖాన్‌, దీప‌క్ హుడా, అవేష్‌ఖాన్ వంటి ఆట‌గాళ్లు ప్రాంచైజీల‌ను ఆక‌ర్షిస్తున్నారు. అందులో మిగ‌తా ఆట‌గాళ్ల కంటే భిన్నంగా ఉంటారు. ప్ర‌స్తుతం న‌లుగురు ఆట‌గాళ్లు ఎందుకు ప్ర‌త్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్రాన్ తాహిర్

ఇమ్రాన్ తాహిర్ ఐపీఎల్ 2022 వేలం జాబితాలో ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్ అత్యంత ఎక్కువ వ‌య‌స్సు క‌ల‌వాడు. తాహిర్ వ‌య‌స్సు 43 ఏళ్లు.

నూర్ అహ్మ‌ద్

నూర్ అహ్మ‌ద్ ఐపీఎల్ 2022 వేలం జాబితాలో పాల్గొన్న‌ 17 ఏళ్ల ఆప్గ‌నిస్తాస్ లెప్ట్ స్పిన్న‌ర్ నూర్ అహ్మ‌ద్‌. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో అతి పిన్న వ‌య‌స్సు క‌లిగి ఉన్న వేలంలో పాల్గొనే ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు.

దినేష్ కార్తిక్

 

దినేష్ కార్తిక్ బార‌త వికెట్ కీప‌ర్‌, బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌. ఈ సారి మెగా వేలంలో చేరిన అత్యంత అనుభ‌వ‌జ్క్షుడైన ఐపీఎల్ ఆట‌గాడు. అత్య‌ధికంగా 213 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం అత‌నికి ఉంది.

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ మోర్గాన్

ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో చేరిన అత్య‌ధిక టీ-20 అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడిన ఆట‌గాడిగా రికార్డు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 113 టీ-20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడాడు.

 

Also Read :  SNEHA SAHI : న‌దిలో 700కిలోల చెత్త‌ను తొల‌గించిన యువ‌తి…ఎందుకంటే..!


You may also like