Home » DJ TILLU TRAILER : డీజే టిల్లు ట్రైలర్ విడుదల…!

DJ TILLU TRAILER : డీజే టిల్లు ట్రైలర్ విడుదల…!

by AJAY
Ad

సిద్ధూ జొన్నగడ్డల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డీజే టిల్లు. ఈ సినిమాలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. వంశీకృష్ణ కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధూ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సినిమాను నిర్మించారు.

Dj tillu trailer

Dj tillu trailer

ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమాలో సిద్ధూ డీజే ఆపరేటర్ గా నటి నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు మరియు టీజర్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. తెలంగాణ యాసలో డీజే టిల్లు చెప్పే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

Advertisement

కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ ఎంతో వినోదాత్మకంగా ఉండడంతో పాటు ఈ సినిమాలో హీరో ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక సినిమా విడుదల తర్వాత ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

 

Visitors Are Also Reading