Home » రాత్రిపూట ఏ టైం కి అన్నం తినాలి..? ఈ సమయంలో మాత్రం అస్సలు వద్దు..!

రాత్రిపూట ఏ టైం కి అన్నం తినాలి..? ఈ సమయంలో మాత్రం అస్సలు వద్దు..!

by Sravya
Ad

చాలామంది ఆరోగ్యం విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుండాలంటే టైం టు టైం ఆహారం తీసుకోవాలి. చాలామంది ఉదయం పూట అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు కొంతమంది అయితే ఆలస్యంగా తింటూ ఉంటారు. అయితే ఇటువంటి తప్పులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాలా మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చాలామంది ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.

Advertisement

Advertisement

దాని వలన ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య లో డిన్నర్ తినేయాలి. ఇది నిజంగా ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. 6 నుండి 8 మధ్యలో ఎప్పుడైనా సరే తినేయండి. రాత్రిపూట బాగా ఆలస్యంగా తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. పైగా రాత్రిపూట హెవీగా ఆహార పదార్థాలను తీసుకోకూడదు. రాత్రి ఆహారం తిన్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. రాత్రి తిన్న వెంటనే నిద్ర పోకూడదు. రాత్రిపూట తిన్న వెంటనే నిద్రపోతే సమస్యలు వస్తాయి. రాత్రిపూట త్వరగా తినడం లైట్ గా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Also read:

Visitors Are Also Reading