Home » ధనుష్ ‘సార్’ మూవీపై దర్శకుడు భారతీరాజా ఏమన్నారంటే..?

ధనుష్ ‘సార్’ మూవీపై దర్శకుడు భారతీరాజా ఏమన్నారంటే..?

by Anji
Ad

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్. తమిళంలో వాతి పేరుతో విడుదల అయింది. ఈ సినిమా పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేసారు ప్రముఖ భారతీయ దర్శకుడు భారతీరాజా. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తదైన ముద్రవేసిన భారతీరాజా విద్యను ప్రోత్సహించడంలో ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఈ చిత్రాన్ని ఓ ప్రత్యేక చిత్రంగా అభివర్ణించారు.

Advertisement

“నా సినీ జీవితంలో ఎన్నో మైలు రాళ్లను చూసాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో సార్ ఒకటి. నేను చాలా సినిమాలు చూస్తున్నాను. సినిమాలు వినోదం పంచడం కన్నా ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఉండాలి. అలాంటి సినిమాలలో వాతి ఒకటి. వాతిలో విద్య ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు అని భారతీరాాజా తెలిపారు. అదేవిధంగా ధనుష్ ని ప్రశంసించారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి సముద్రఖని, టీచర్  పాత్రలో ఒదిగిపోయిన సంయుక్త గురించి ఆయన ప్రశంసించారు. అదేవిధంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ అద్భుతమైన సంగీతమందించారని పొగిడారు. ఈ ఏడాది జీవీ ప్రకాశ్ జాతీయ అవార్డు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement

Also Read :  ప్రభాస్ తండ్రి, తారకరత్న, పవన్ కళ్యాణ్ కి సింక్ అయ్యే లింక్ గురించి మీకు తెలుసా ?

Manam News

సార్ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని భారతీరాజా కోరారు. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో సార్ ఒకటి. ఈ చిత్రం థియేటర్లలో తప్పక చూడాల్సిన చిత్రం. మీరు ఈ చిత్రాన్ని సినిమా థియేటర్లలో చూసి ఆ అనుభూతిని పంచుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ద్విభాష చిత్రం సార్. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ధనుష్, సముద్రఖని, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. జీ.వీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఫిబ్రవరి 17న విడుదలైన సార్ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంటోంది.

Also Read :   మరోసారి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Visitors Are Also Reading