Home » ప్రభాస్ తండ్రి, తారకరత్న, పవన్ కళ్యాణ్ కి సింక్ అయ్యే లింక్ గురించి మీకు తెలుసా ?

ప్రభాస్ తండ్రి, తారకరత్న, పవన్ కళ్యాణ్ కి సింక్ అయ్యే లింక్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న మరణం నందమూరి-నారా వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. జనవరి 27న అకస్మాత్తుగా  కుప్పకూలిపోయిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఫిబ్రవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి ఇంటికి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు. వారి ప్రార్థనలు మాత్రం ఫలించలేదు. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయారు. 

Advertisement

తారకరత్న శివరాత్రి శివైక్యమయ్యారు. ఈ వార్తతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమంతా ఆశ్చర్యపోయారు. ప్రధాని మోడీ మొదలు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారంతా సంతాపం వ్యక్తం చేస్తూ.. నివాళులర్పించారు. బాబాయ్ బాలయ్య బాధ వర్ణణాతీతం. బాలకృష్ణను చూడగానే తారకరత్న పెద్ద కుమార్తె నిషిక పరుగెత్తుకుంట వచ్చి అలింగనం చేసుకోవడం అందరినీ కలిచివేసింది. 

Also Read :   తారకరత్నని చివరి చూపు చూసేందుకు మోహన్ బాబు రాకపోవడానికి కారణం అదేనా..?

Advertisement

అబ్బాయి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ.. ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య తారకరత్నని  అలా చూసి కంటతడి పెట్టారు. తారకరత్న కుటుంబం తమ కుటుంబంలో భాగం అని.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ముగ్గురు పిల్లల బాధ్యత తాను చూసుకుంటానని మాట ఇచ్చారు. బాలయ్యకి తారకరత్న కుటుంబం రుణపడి ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే.. రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు, ప్రభాస్ నాన్న ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కూడా శివరాత్రి రోజునే శివైక్యమయ్యారు. 

Also Read :   తారకరత్నకు తాత ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలుసా ? పిల్లల పేర్లలో కూడా..!

ఆ కోరిక తీరకుండా తారకరత్న కన్నుమూయడం బాధాకరం: పవన్ కల్యాణ్

 

ఫిబ్రవరి 12, 2010న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దంపతులకు కుమార్తె ఆద్య 2010 శివరాత్రి రోజే పుట్టినట్టు సమాచారం. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరావు, నందమూరి తారకరత్న ఇద్దరూ కూడా శివరాత్రి రోజే శివైక్యం కావడం యాధృచ్ఛికమని చెప్పాలి. ఇవాళ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు. 

 Also Read :  మరోసారి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

 

Visitors Are Also Reading